Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సతమోరి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మహోత్సవం

Author
Posted By HINDUSTAN
| 25 Sep 2026, 03:38 PM | HEALTH, TELANGANA
సతమోరి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మహోత్సవం

సిరికొండ, సెప్టెంబర్ 25: లచంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సతమోరి సెంటర్‌లో పోషణ మహోత్సవం అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జాదవ్ విమల మాట్లాడుతూ ప్రతి గర్భిణీ, బాలింత, కిశోర బాలిక ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని తెలిపారు. రక్తహీనతను నివారించడంతో పాటు గర్భంలోని శిశువు సరైన శారీరక, మానసిక ఎదుగుదలకు పోషకాహారం ఎంతో అవసరమని వివరించారు.

సతమోరి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మహోత్సవం - Additional Image

గర్భిణీలు గర్భధారణ సమయంలో కనీసం నాలుగుసార్లు వైద్యుల సూచన మేరకు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, బాలింతలు రోజుకు కనీసం 3 నుంచి 4 సార్లు నీరు, మజ్జిగ, సూప్‌ల వంటి ద్రవాహారాలను తీసుకోవాలని సూచించారు. శిశువు జన్మించిన వెంటనే వీలైనంత త్వరగా, ముఖ్యంగా మొదటి గంటలోపే తల్లిపాలు పట్టించడం ఎంతో ముఖ్యమని తెలిపారు.

ఇవి కూడా చదవండి

కార్యక్రమంలో భాగంగా ఐదుగురు గర్భిణీలకు సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు.

సతమోరి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మహోత్సవం - Additional Image

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కె. దీపక్, పంచాయతీ కార్యదర్శి ఎం. నెహ్రూ, సతమోరి అంగన్‌వాడీ టీచర్ వీణ, వైపేట్ సెక్టార్‌కు చెందిన అంగన్‌వాడీ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.