Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

‘సీఎం ప్రవాసీ ప్రజావాణి సందర్శించిన గల్ఫ్ సోషల్ వర్కర్స్‌

Author
Posted By HINDUSTAN
| 30 Sep 2026, 02:35 PM | INTERNATIONAL, saudi arabia, TELANGANA, TELUGU NRI
‘సీఎం ప్రవాసీ ప్రజావాణి సందర్శించిన గల్ఫ్ సోషల్ వర్కర్స్‌

సౌదీ అరేబియా: గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో సామాజిక సేవకులు, ప్రవాస సంఘాల పాత్ర కీలకం
హైదరాబాద్ ప్రజాభవన్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ వేదికపై గల్ఫ్ సామాజిక సేవకులు పొన్నం సత్యనారాయణ (దుబాయి) మరియు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) రియాద్ ప్రతినిధి ఖాజా ముజాములుద్దీన్కు మంగళవారం సత్కరించారు.

రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్‌పర్సన్, ‘సీఎం ప్రజావాణి’ ఇన్‌చార్జి గద్వాల్ విజయలక్ష్మి, స్టేట్ నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్ ఇద్దరు సామాజిక సేవకులను అభినందించారు.

ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో సామాజిక సేవకులు, ప్రవాస సంఘాల పాత్ర ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఎంబసీలు, కాన్సులేట్లతో సమన్వయం చేసుకుంటూ గల్ఫ్ కార్మికులకు అత్యవసర సమయాల్లో అందిస్తున్న సేవలను వారు అభినందించారు.

ఇవి కూడా చదవండి

గల్ఫ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు అత్యవసర పరిస్థితుల్లో అండగా నిలుస్తూ, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో సామాజిక సేవకులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సీఎం ప్రవాసీ ప్రజావాణి లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, వాలంటీర్లు గంగుల మురళీధర్ రెడ్డి, మహమ్మద్ బషీర్ అహ్మద్, అలాగే మహేష్ కె పి సాటా తెలంగాణ రిప్రజెంటేటివ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గల్ఫ్ సామాజిక సేవకులకు లభించిన ఈ ప్రత్యేక గుర్తింపుపై సాటా ఫౌండర్ మల్లేశం, సాటా రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ, మరియు రియాద్ ఉమెన్స్ అధ్యక్షులు శర్వాణి విద్యాధరణి మరియు SATA కోర్ టీమ్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ, వారిని ప్రత్యేకంగా అభినందించారు.

గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం సామాజిక సేవకులు చేస్తున్న సేవలకు లభిస్తున్న గుర్తింపు మరింత మంది సేవకులకు స్ఫూర్తినిస్తుందని సాటా నాయకత్వం పేర్కొంది.