Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం – TBD సీజన్ 5 విజయవంతం

Author
Posted By HINDUSTAN
| 19 Sep 2026, 08:52 PM | INTERNATIONAL, NATIONAL, saudi arabia, TELANGANA, TELUGU NRI
రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం – TBD సీజన్ 5 విజయవంతం

సౌదీ అరేబియా: సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఆధ్వర్యంలో శుక్రవారం రియాద్‌లో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవం (TBD) సీజన్–5 విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగు కుటుంబాలు, తెలుగు సంఘాల ప్రతినిధులు, సాంస్కృతిక బృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సౌదీ అరేబియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ, నుంచి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ ప్రవీణ్ కుమార్ గారు
సెకండ్ సెక్రటరీ (కన్సులర్ ) తెలుగు భాషా దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. సౌదీ అరేబియాలో నివసిస్తున్న తెలుగు ప్రజలు భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ఇంత పెద్ద స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. తెలుగు ప్రజలంతా ఐక్యంగా ఉండి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. మరియు క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఇండియన్ ఎంబసీ సెకండ్ సెక్రటరీ (కన్సులర్ ) చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది.

రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం – TBD సీజన్ 5 విజయవంతం - Additional Image

సాటా వ్యవస్థాపకులు మల్లేశన్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించడం ఎంతో ఆనందకరమైన విషయమని, విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

సాటా రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ మాట్లాడుతూ, సౌదీ అరేబియాలోని తెలుగు ప్రజలందరూ ఒకే వేదికపై కలిసి తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో శుభకరమైన విషయమన్నారు. తెలుగు భాష కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి గారిని స్మరించుకుంటూ జరుపుకుంటాం.
ఆయన వ్యావహారిక తెలుగు భాష కోసం ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన జయంతి అయిన ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన భాష, సంస్కృతి, సాహిత్యాన్ని స్మరించుకోవడంతో పాటు, తెలుగు ప్రజల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేసుకోవాలని అన్నారు.

ఇవి కూడా చదవండి

రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం – TBD సీజన్ 5 విజయవంతం - Additional Image

విదేశాల్లో జీవిస్తున్న తెలుగు ప్రజలు ఒకరికొకరు అండగా నిలవాలని, కష్టాల్లో ఉన్న వారికి సాధ్యమైనంత సహాయం అందిస్తూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని రియాద్ అధ్యక్షులు పిలుపునిచ్చారు. సౌదీ అరేబియాలో తెలుగు సమాజం ఐక్యతతో ముందుకు సాగుతూ మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

సాటా ఉమెన్స్ ప్రెసిడెంట్ శ్రీమతి శర్వాణి విద్యాధరాణి మాట్లాడుతూ, వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగు కుటుంబాలు ఇలా ఒకే వేదికపై కలిసి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యత, సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.

రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం – TBD సీజన్ 5 విజయవంతం - Additional Image

కార్యక్రమంలో సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ జిద్ధ అధ్యక్షులు అంజాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. అంజాద్ ఆలపించిన అందమైన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం, నృత్య ప్రదర్శనలు, ఇతర కళా కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తెలుగు సంప్రదాయ రుచులతో ఏర్పాటు చేసిన విందు భోజనం కూడా కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సౌదీ అరేబియాలో ఉన్నప్పటికీ స్వదేశంలో తెలుగు పండుగను జరుపుకున్న అనుభూతి కలిగిందని పలువురు పాల్గొన్నవారు ఆనందం వ్యక్తం చేశారు.

రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం – TBD సీజన్ 5 విజయవంతం - Additional Image

తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సౌదీ అరేబియాలోని తెలుగు ప్రజల మధ్య ఐక్యత, పరస్పర సహకారం మరింత బలోపేతం చేయడమే సాటా లక్ష్యమని. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన సాటా కోర్ టీమ్, ఆర్గనైజింగ్ టీమ్, వాలంటీర్లు, సాంస్కృతిక బృందాలు, ప్రత్యక్షంగా, పరోక్షంగా శహాయ షహకారాలు అందించిన మరియు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన తెలుగు కుటుంబాలకు, సాటా రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ మరియు కోర్ టీం సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం – TBD సీజన్ 5 విజయవంతం - Additional Image