Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఎన్‌ఆర్‌ఐలకు డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు

ఎన్‌ఆర్‌ఐలకు డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు

సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని ఎన్‌ఆర్‌ఐల కోసం డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆన్‌లైన్ జూమ్ సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్.వి. కె. రెడ్డి గారు మరియు పలు విభాగాల డైరెక్టర్లు ప్రొ. డి . రబింద్రనాథ్ సోలమన్,
ప్రొ. పల్లవి కాబడే, ప్రొ. కె శ్రీదేవి, డా. వెంకటేశ్వర్లు పాల్గొని, ఎన్‌ఆర్‌ఐలకు అందుబాటులో ఉన్న ఉన్నత విద్యా కోర్సులు, అర్హతలు, ఫీజులు, అడ్మిషన్లు, పరీక్షల విధానం తదితర అంశాలను స్పష్టంగా వివరించారు.

ఎన్‌ఆర్‌ఐలు తమ నివాస దేశం నుంచే ఉన్నత విద్యను కొనసాగించే విధంగా డిగ్రీ, పీజీ, ఎంబీఏ తదితర ఉన్నత విద్యా అవకాశాలను వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో ఫీ మరియు పరీక్షల నిర్వహణ, అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఎన్‌ఆర్‌ఐలకు డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు - Additional Image

ఈ సమావేశంలో ఎన్ ఆర్ ఐ అడ్వైసరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ డా. బీ.ఎం.వినోద్ కుమార్,
ఎన్ ఆర్ ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్
శ్రీ మందా భీమారెడ్డి గారు, సామాజిక కార్యకర్త శ్రీ మహేశ్ కే.పీ. గారు, సౌదీ అరేబియాలోని సామాజిక సేవా కార్యకర్త శ్రీనివాస్ మచ్చ గారు పాల్గొన్నారు. ఎన్‌ఆర్‌ఐలకు కోర్సులు, అడ్మిషన్లు మరియు ఇతర వివరాలపై సహాయం అవసరమైతే మహేశ్ కే.పీ. గారు +919032076267 మరియు శ్రీనివాస్ మచ్చ గారిని +966 541507276 సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సౌదీ అరేబియాలోని వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు మరియు ఎన్‌ఆర్‌ఐలకు విశ్వవిద్యాలయ ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్‌ఆర్‌ఐలు డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కల్పించే ఈ ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ విద్య, వృత్తిపరమైన అభివృద్ధికి ముందుకు రావాలని నిర్వాహకులు కోరారు.