Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పోషకాహారంపై అవగాహన కల్పించిన ఐసీడీఎస్ అధికారులు

Author
Posted By HINDUSTAN
| 22 Sep 2026, 01:11 PM | HEALTH, TELANGANA
పోషకాహారంపై అవగాహన కల్పించిన ఐసీడీఎస్ అధికారులు

ఆదిలాబాద్, ఇచ్చోడ, సెప్టెంబర్ 22 (రిపబ్లిక్ హిందుస్థాన్):
పోషణ మహా అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇచ్చోడ మండలం సాత్నంబర్ గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జాదవ్ విమల పాల్గొని ఎస్‌హెచ్‌జీ గ్రూప్ సభ్యులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు.
రోజువారీ ఆహారంలో ధాన్యాలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు, మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పోషకాహారంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. భోజనానికి ముందు, భోజనం చేసిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.
3 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలను ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. గర్భిణులు ప్రసవం వరకు వైద్యుల సూచనల మేరకు కనీసం 180 ఐరన్ మాత్రలు, కాల్షియం మాత్రలు క్రమం తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. ఆకుకూరలు, పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని వివరించారు. ప్రసవం తప్పనిసరిగా ఆసుపత్రిలోనే జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, ఎస్‌హెచ్‌జీ గ్రూప్ సభ్యులు, యూత్ గ్రూప్ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్త నివేదిత తదితరులు పాల్గొన్నారు.

పోషకాహారంపై అవగాహన కల్పించిన ఐసీడీఎస్ అధికారులు - Additional Image