పాల్గొన్నా కలెక్టర్ , ఎంపీ , ఐటిడిఎ పీవో మరియు ఇతర ఉన్నతాధికారులు….
రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో లోని వజ్జర్ గ్రామం ను ప్రధాన సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం లో భాగంగా ఎంపిక చేశారు.

గురువారం వజ్జర్ గ్రామం లో గ్రామం సమస్యల మరియు అభివృద్ది పై కలెక్టర్ అద్యక్షతన సమావేశం నిర్వహించారు. మొదటగా డ్వామా పిడి కిషన్ గ్రామ యొక్క పూర్తి నివేదిక చదివి వినిపించారు.
ప్రధాన మంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజన యోజన(SSY):
అభివృద్ది కి నోచుకోని గ్రామాలను విడతల వారీగా ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వజ్జర్ గ్రామమును ప్రధాన్ మంత్రి సంసాద్ ఆదర్శ్ గ్రామ యోజన్లో ఎంపిక చేశారు. ఎంపిక చేసుకున్నా గ్రామానికి జిల్లా కలెక్టర్ నోడల్ అధికారి గా వ్యవహరిస్తారు.
ఈ నోడల్ అధికారి ఆధ్వర్యంలో గ్రామంకి కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు మంజూరు అవుతాయని అధికారులు పేర్కొన్నారు. తద్వారా గ్రామమును అభివృద్ది చేసి అన్ని సౌకర్యాలు కల్పించాలి అని ఉద్దేశం తో ఈ పథకం మొదలు పెట్టారు.
ప్రతి పార్లమెంట్ సభ్యుడు నాలుగు గ్రామాలను ఎంపిక చేసుకోవాలి….
ఒక పార్లమెంట్ సభ్యుడు 4 గ్రామాలను ఎంపిక చేసుకోవచ్చు. అందులో భాగంగా బోథ్ మండలం లోని వజ్జర్ గ్రామాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. వజ్జర్ గ్రామంలో 417 మంది జనాభా ఉంది. 98 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. బోథ్ మండల కేంద్రం నుండి 18 km దూరం లో దట్ట మైన అడవి ప్రాంతం లో ఈ గ్రామం ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదు. ఇక్కడ కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడైనా తమ గ్రామాన్ని అభివృద్ధి పథకం లో ఎంపిక చేసినందుకు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ..
అనంతరం గ్రామ పెద్దలు తమ తమ గ్రామ సమస్యలు సభా అధ్యక్షులు కలెక్టర్ సిక్త పట్నాయక్, ఎంపి సోయం బాపు రావు కి విన్నపించారు..
సమావేశం ప్రారంభం అయ్యాక గ్రామస్తులు వేదిక పైన ఉన్న కలెక్టర్ కి మరియు ఎంపీ సోయం బాపురావులను తమ గ్రామ సమస్యలు చెప్పారు. గ్రామస్తులు అయిన భగవాన్ గుట్ట పక్కకు ఉండడం వలన గుట్ట నీరు మొత్తం కిందికి వచ్చి మొత్తం మట్టి కొట్టుకవస్తుందని అన్నారు. గ్రామంలో మురికి కాలువలు మరియు సీసీ రోడ్ మురికి నీళ్లు మొత్తం ఇళ్లలో ప్రవర్తిస్తుందని అన్నాడు.
తాగడానికి కూడా మంచి నీరు రాక అవస్థ పడుతున్నాం అని తెలిపారు.
పోడు వ్యవసాయం చేసుకుంటున్నాం …. పట్టాలు ఇవ్వండి
పోడు వ్యవసాయం చేస్తున్న మాకు ఇప్పటి వరకు పట్ట లు కలేవని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాడు. మిగతా గ్రామస్తులు మాట్లాడుతూ వజ్జర్ గ్రామం పార్డీ (బి) రాయి సెంటర్ లో ఉందని ఈ రాయి సెంటర్ కి 18 గ్రామంలో 2246 పోడు భూమి వ్యవసాయం చేస్తున్నామని అన్నారు. ఈ 2246 రైతులకు ఇప్పటి వరకు పట్టాలు రాకపోవడం తో ప్రభుత్వ ఫలాలు అందడం లేదని తెలిపారు. అలాగే అంగన్వాడి కేంద్రం కి భవనం లేదని, స్కూల్ కి ప్రహరీ గోడ లేక పశువులు లోపలికి వస్తునాయని , మరి ముఖ్యంగా ఇక్కడ సెల్ నెట్వర్క్ సిగ్నల్ రాక నాన అవస్థలు పడుతున్నామని అన్నారు. ఇదే ప్రధాన సమస్య అని అంన్నారు.
అనంతరం అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడరు ఇలా గుట్టల మధ్య ఊరు చాలా బాగుంది అని తెలిపారు. ఇక్కడ యువత ఎక్కువ ఉంది అని యువకులకు కేంద్ర మరియు రాష్ట్రా పథకాలు చాలా ఉన్నాయి అని వాటిని ఉపయోగించుకోవాలి అని తెలిపారు.
సమస్యలు మీ దగ్గర ఉంచుకోకుండా అధికారులకు లిఖిత పూర్వకంగా ఇస్తే వాటిని అధికారులు సానుకూల పరిష్కరిస్తారు అని తెలిపారు. యువకులు కూడా ఈ స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలి అని కోరారు.

అనంతరం జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ మాట్లాడుతు వజ్జర్ గ్రామం లో ఉన్న వారు అదృష్టవంతులు అని ఇలాంటి అందమైన గ్రామం ఎక్కడ ఉండదు అని ఈ గ్రామాన్ని చూసి నాకు చాలా సంతోషం వేసింది అని తెలిపారు. చుట్టూ అడువులు పచ్చన్ని చెట్లు మైమరిపించేల ఉన్నాయని అని తెలిపారు. ఇంత మంచి పర్యావరణం చాలా అద్బుతం అన్నారు. గ్రామ సమస్యలు అన్నీ నా దృష్టికి తీసుకొని వచ్చారు వీలైనంత త్వరలో మీ సమస్యలు అన్నీ ఒక్కొక్కటి గా పరిష్కరించెందుకు కృషి చేస్తామని అన్నారు. జిల్లా అధికారులు మీకు అందుబాటులో ఉండి సమస్యల సాధనకు కృషి చేస్తాం అని తెలిపారు. వజ్జర్ గ్రామం నీ ఆదర్శ గ్రామము గా తీర్చిదిద్దాము
మన అందరి బాధ్యత అని తెలిపారు.
వజ్జర్ ను అభివృద్ధి పథంలో తీసుకెళుతా … : ఎంపీ సాయం బాపురావ్

ప్రధాన్ మంత్రి సంసాద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కార్యక్రమం సభా ముఖ్య అధ్యక్షుడిగా పాల్గొన్నా అదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు మాట్లాడుతూ వజ్జర్ గ్రామం నేను ఎమ్మెల్యే గా ఉన్నపుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది అని, ఎటువంటి మార్పు చెందలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎం చేసిందో అని అర్థం కావడం లేదని అన్నారు. నేను ఇక్కడ ఉపాద్యాయుడు గా పనిచేసిన అనుభవం ఉంది అని పాత రోజులు గుర్తు చేసుకున్నారు.
సమస్యలు ఎక్కడ పడేసిన గొంగళిలాగే ఉన్నాయన్నారు. అందుకే ఈ గ్రామాన్ని ప్రధాని సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన లో ఎంపిక చేశామని అన్నారు. కేంద్రం ప్రభుత్వం నుండి సక్షేమా పథకాలు చాలా ఉన్నాయని , వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి వారికి ఈ పథకాలు వర్తించేలా చూడడం అధికారుల బాధ్యత అని అన్నారు.
మరియు పోడు వ్యవసాయం మరియు వారి పట్టాలు ఇవ్వటం పై కేంద్రం సానుకూలం ఉందని ఎంపీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎటు వంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఇప్పటికీ అయిన ప్రభుత్వం ఈ పోడు పట్టాలు పై సరి అయిన నిర్ణయం తీసుకోవాలని కోరారు మరియు ఏమైనా ఈ పట్టాలు జారీ చేయడం లో ఇబ్బంది ఉంటే కేంద్రానికి నివేదిక పంపాలని కోరారు.
ప్రధాన సమస్య అయిన నెట్వర్క్ సిగ్నల్ సమస్య కావున ఇది కూడా అధికారుల తో మాట్లాడను బిఎస్ఎన్ఎల్ కి ఎంపీ చైర్మన్ కావున నేను అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం జరిగేలా చూస్తానని అన్నారు.
కరోనా వల్ల కూలీల కొరత కారణంగా ఆలస్యం సిగ్నల్ అందించే పనుల్లో జాప్యం జరిగింది ని, త్వరలో టవర్ నిర్మాణం పనులు చేపడతామని తెలిపారు.
మహిళలకు రుణాలు ఇవ్వండి…
మహిళా గ్రూపులకు లోన్ ఇవ్వడం లేదని మహిళలు సమస్య ను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అర్హులైన మహిళల సంఘాలకు రుణాలు అందేలా చూడాలని తెలిపారు. బ్యాంకర్లు కూడా బ్యాంక్ లో లోన్ ఇవ్వడం లో అలసత్వం వహిస్తున్నారు. చెయ్యకుండా చూడాలని కోరారు. అలాగే పూర్తి స్థాయిలో సీసీ రోడ్స్ మరియు మురికి కాలువల నిర్మాణం చేపిస్తా అని హామీ ఇచ్చారు.
వజ్జర్ పై తన పాత అనుబందం ను గుర్తు చేసుకుంటు , ఇంతకు ముందు మంచి నీరు కోసం బిందె ను పట్టుకొని నేను గుట్ట దిగి పోతుండే , పొద్దున పోతే సాయంత్రం వరకు బిందె లో నీరు పట్టుకొని వస్తుండే ఇలాంటి బాధలు ఎవరికి రావద్దని , మిషన్ భగీరథ అధికారులు గ్రామానికి నీరు అందించే బాధ్యత మీ పై ఉంది అని వారికి తెలిపారు. అలాగే వైద్యం కోసం 12 కిమి పోతున్నారు అని చాలా కష్టం ఉంది అని కనుక ఇక్కడ హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం.
పై జరిగేవన్ని సూడాలి అంటే ముందుగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. ఈ టీకా పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని నేను టీకా వేసుకున్న ఆరోగ్యంగా ఉన్ననని, టీకా తో మనం బతుకుతం అని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని టీకా వల్ల లాభం ఉంది తప్ప నష్టం ఏమి లేదని కావున ప్రతి ఒక్కరూ టీకా వేసుకొని ఆరోగ్యంగా ఉండాలి అన్నారు. త్వరలో మనం అందరం వజ్జర్ ను ఆదర్శ గ్రామం గా చూస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ భూమా బాయి, జెడ్పీటీసీ సంధ్యారాణి,ఎంపీపీ తుల శ్రీనివాస్, దక్షిణ మధ్య రైల్వే సభ్యుడు జీవి రమణ, ఎంపీటీసీ సిడం సంబు మరియు అయ గ్రామాల సర్పంచ్ లు మరియు అన్ని శాఖల జిల్లా అధికారులు,పోలీస్ సిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments