రిపబ్లిక్ హిందూస్థాన్, రామగుండం : రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి మంథని సర్కిల్‌లోని , మంథని పోలీస్ స్టేషన్, రామగిరి పోలీస్‌స్టేషన్లను, రవీందర్ డీసీపీ పెద్దపల్లి, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, మంథని సీఐ సతీష్ లతో కలిసి పోలీస్ స్టేషన్లను పరిశీలించారు.
పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది పనితీరు, నమోదయ్యే కేసుల వివరాలకు సంబంధించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల పనితీరు, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాధాల గురించి తీసుకుంటున్న నివారణ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని, వర్ణికల్స్ విధానం, 5S విధానాలపై మరింత అవగాహన పెంపొందించుకునేందుకు అధికారులకు,సిబ్బందికి శిక్షణ అందజేయాల్సి ఉంటుందని సూచించారు. ప్రజలు అందించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత పోలీసులపై ఉందన్నారు. నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు. అదేవిధంగా మంథని మండలంలో ని అరెంద గ్రామాన్ని సందర్శించి, అక్కడ గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మొన్నటి భారీ వర్షాలకు రైతులు ఎదుర్కొన్న సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని గ్రామస్తులతో చెప్పారు., అనంతరం గ్రామస్తులతో కలసి గోదావరి మరియు మానేరు నదులు కలిసే స్థలాన్ని సందర్శించి గ్రామస్తుల కోరికమేరకు వారితో ఫోటోలు దిగడం జరిగింది.






Recent Comments