నిజామాబాద్: రైతులు వరి పంటను అధికంగా పండిస్తారు అని సన్నవడ్ల రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తూ నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం అని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ధర్పల్లి మండలాం లో సుడిగాలి పర్యటన పలు రకాల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మోబిన్ సాబ్బాయ్ తండా, గోవింద్పల్లి,బెల్య తండా, మర్రాయి తండా,ధర్పల్లి, ఎస్ బి తండా, దమ్మన్నపేట్ గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని గ్రామాలకు అన్నీ పనులను చేస్తానని హామీ ఇచ్చాను. మాట ఇస్తే తప్పమని ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తామని ఆయన అన్నారు.
కొన్ని పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలన చేసి తెలంగాణను అప్పుల తెలంగాణ చేశారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వంకు సపోర్ట్ చేస్తూ మన రాష్ట్ర అభివృద్ధికి తోడుపడాలని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు,
మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ధర్పల్లి సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, సొసైటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ యువజన నాయకుడు నరేష్, జిల్లా అధికార ప్రతి నిధి చెలి మేళా నర్సయ్య, జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగ్త్యా నాయక్, కాంగ్రెస్ గ్రామా శాఖ లా అధ్యక్షులు,మాజీ సర్పంచ్ లు,
మాజీ ఎంపీటీసీ లు,కార్యకర్తలు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments