
- సరైన సమయంలో న్యాయం జరిగినప్పుడు బాధితులకు లబ్ధి చేకూరుతుంది.
- సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయం నందు గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ.
- దాదాపు 30 సమస్యలను జిల్లా ఎస్పీకి తెలియజేసిన ఫిర్యాదుదారులు.*ప్రజల రక్షణ, భద్రతకై 24 గంటలు బాధ్యతాయుతంగా పని చేసే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ.
- సమస్యలను విన్న వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సూచనలు..
ఆదిలాబాద్: సోమవారం స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయం నందు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు ముఖ్య అధికారిని జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదారులు కలిసి సమస్యలను తెలియజేశారు. దాదాపు 30 మంది ఫిర్యాదుదారులు ఫిర్యాదులను సమర్పించగా అందులో కుటుంబ కలహాలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, పలు కేసుల సమస్యలను విన్న జిల్లా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలను ఇచ్చి ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.


సమాజంలో 24 గంటలు ప్రజల రక్షణ భద్రతకై పనిచేసే ఏకైక వ్యవస్థ జిల్లా పోలీసు వ్యవస్థ అని తెలియజేస్తూ ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100 ను సంప్రదించాలని సూచించారు. జిల్లా ప్రజలు అసాంఘిక కార్యకలాపాలను జరుగుతున్న సమాచారం ఏదైనా మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 📞8712659973 అనే నెంబర్ కి సమాచారాన్ని అందించవచ్చని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
వచ్చిన ఫిర్యాదుదారులలో పోలీసు వ్యవస్థ పరిధి దాటి ఉన్న ఆస్తి తగాదాలు, భూమి తగాదాలు పంచాయితీలు ఉన్నవాటికి చట్ట ప్రకారం ఉన్న నిబంధనలకు లోబడి నడుచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ స్థాయిలో పరిష్కరించబడే ఏ ఫిర్యాదు నైనా వెంటనే స్వీకరించి పరిష్కరించి ప్రజలకు సరైన సమయంలో న్యాయాన్ని అందించి లబ్ధి చేకూర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిసి కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments