Thursday, June 12, 2025

పెళ్ళిల్లో హిజ్రాల లొల్లి …. డబ్బులు ఇవ్వకుంటే పెళ్లి జరగనివ్వని పరిస్థితి

ముక్కు పిండి రూ. 10 వేల నుండి రూ. 50 లకు పైగా వసూలు …

ముహూర్తం సమయంలో ఎంట్రీ ఇచ్చి డిమాండ్ . ..

ఇంట్లో లేదా ఫక్షన్ హాల్ ఎక్కడ జరిగిన వీరి నుండి మండల వాసులకు తప్పని తిప్పలు…

అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే విచిత్ర చేష్టలు, శాపనార్థాలు పెడతామంటూ, బట్టలు తీసివేస్తామని బెదిరింపులు ..


రిపబ్లిక్ హిందూస్థాన్ , ఆదిలాబాద్ : సమాజంలో థర్డ్ జెండర్ మీద వివక్ష మెల్లగా పోతోంది. ఇప్పుడిప్పుడే వాళ్లను కూడా మనలో ఒకరిగా గుర్తిస్తున్నారు. ఆయా రంగాల్లో ప్రోత్సహిస్తూ భరోసానిస్తున్నారు. చాలా మంది.. పలు రంగాల్లో కష్టపడి రాణిస్తున్నారు కూడా. ఇది ఒకవైపు మాత్రమే. ఇంకోవైపు మాత్రం ఎప్పటిలాగే హిజ్రాలు రెచ్చిపోతున్నారు. ట్రైన్లు, రోడ్లపై డబ్బులు డిమాండ్ చేస్తూ.. ఇవ్వకపోతే వికృత చేష్టలకు పాల్పడుతూ.. జనాలను ఇబ్బందిపెడుతూనే ఉన్నారు. కొందరి ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఈ ట్రైన్లు, రోడ్ల మీద డబ్బులు అడగటం ఒక ఎత్తైతే.. ఆదిలాబాద్ లో ఎక్కడైనా శుభకార్యం చేయాలంటేనే జనాలు భయపడే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆదిలాబాద్ జిల్లా లో పెళ్లి లు జరుపుకునే వారు జంకుతున్నారు. ఇంటివద్ద కానీ ఫంక్షన్ హాల్లో కానీ జరుగుతున్న పెళ్లిలకు హిజ్రాలు ముహూర్తానికి పెళ్లి జరగకుండా అడ్డుపడుతున్నారు. ముహూర్తానికి పెళ్లి జరగాలి అంటే తాము ఆడినంత డబ్బులు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.



తాజాగా ఇచ్చోడ మండలంలో హిజ్రాలు ఒక పెళ్లి వేడుకలో సరిగ్గా పెళ్లి ముహూర్తం సమయానికి పెళ్లి మండపం వద్ద చేరి రూ. 20 వేలు డిమాండ్ చేశారు. అయితే పెళ్ళికూతురు కుటుంబం నిరుపేద కావడంతో రూ.3000 వేలతో సరిపెట్టుకోవాలి తీసుకోవాలని కోరారు.

ఒక గంట హంగామా చేసి చివరికి కాళ్ళు పట్టుకుంట రూ . 5000 వేలు తీసుకోవాలని వేడుకోవడం గంట సేపు హంగామా కు తెరపడింది.

ఇచ్చోడ లో ఓ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న పెండ్లి లో అడిగినంత డబ్బులు ఇవ్వకపోవడంతో పెళ్లి మండపంలో చేరి పెళ్లి అడ్డుకున్న దృశ్యం ….



అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే మేము పెట్టే శాపానికి బలై పోతారు అని బెదిరిస్తున్నారు.
శుభకార్యాలు జరిగే సమయంలో కుటుంబ పరిస్థితులతో సంబంధం లేకుండా హిజ్రాలు ఇబ్బంది పెడుతున్నారు.

ఇవ్వకుంటే మీరు మగాళ్ళు కారా అని అవమాన పరుస్తున్నారనీ పలువులు వాపోతున్నారు.

పెళ్ళి ముహూర్తానికి జరగకుండా హిజ్రాల చేష్టల వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్న వారు పెట్టే శాపనార్థాల వళ్ళ ఎక్కడ కీడు జరుగుతుందో అని పెళ్లి తరుపు వారు వీళ్ళ చేష్టలు తట్టుకోలేక అడిగిందత ఇవ్వడమే మేలని అనుకుంటున్నారు.

దీనిపై అధికారులు దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.

అయితే ఇచ్చోడ మండల కేంద్రంలో జరిగిన పెళ్లి లో ముహూర్త సమయానికి చేరి పెళ్లి అడ్డుకున్న హిజ్రాల వీడియో ఒకటి బయటకు వచ్చింది.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి