రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
అన్ని మతాల వారు ఐక్యమత్యం పాటిస్తూ పండగలను ప్రశాంతగా నిర్వహించుకోవాలని అదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పోలీసు శాఖ ఆధ్వర్యం లో ఇచ్చోడ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశానికి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హాజరై మాట్లాడారు. అన్ని మతాల ప్రజలు పండగలను సోదర భావం తో… ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. పండగల సమయాల్లో సోషల్ మీడియాలో మత విధ్వేశాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టరాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మండపాల వద్ద తాత్కాలిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచనలు చేశారు. మండపాల ఏర్పాటు కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గణేష్ చవితి, నిమజ్జన ఉత్సవాలలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, బోథ్ సీఐ నైలు, ఇచ్చోడ తాసిల్దార్ మోహన్ సింగ్, స్థానిక ఎస్సై ఉదయ్ కుమార్, ఇచ్చోడ గ్రామ పంచాయతీ సర్పంచ్ సునీత , సిరికొండ ఎస్సై నిరేశ్,హిందూ, ముస్లిం మత పెద్దలు, గణేష్ మండపాల నిర్వాహకులు, వివిధ పార్టీల శ్రేణులు, పెద్దలు తది తరులు పాల్గొన్నారు.
Recent Comments