గిరిజనేతరుల అక్రమ కట్టడాలను కూల్చి వేసి వారి మీద కేసులు నమోదు చేయాలని చేస్తున్న దీక్షకు మద్దతు ప్రకటించిన ఆదివాసీ సేన
క్విట్ ఏజెన్సీ ఉద్యమాన్ని ఉదృతం చేయాలి- ఆదివాసీ సేన రాష్ట్ర నాయకులు ఊకె రవి
🟥 క్విట్ ఏజెన్సీ ఉద్యమమే అన్ని సమస్యలకు పరిస్కారం
🟥 అధివాసులందరు ఆధివాసియిజంని ప్రమోట్ చేయాలి
🟥 నాన్ ట్రైబల్ యిజలను ఆదివాసులు బహిష్కరించాలి
రిపబ్లిక్ హిందుస్థాన్, భద్రాద్రి జిల్లా: ఉద్యమకారులు ఏ.ఎన్.ఎస్.సంఘం చేస్తున్న ఉద్యమం సరి అయినది అని వలస గిరిజనేతరులు ఏజెన్సీ వదిలి వెళ్లిపోవాలని ఆదివాసీ నవనిర్మాణ సేన చేపట్టిన రిలే నిరాహారదీక్షకు ఆదివాసీ సేన మంగళవారం తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భద్రాద్రి జిల్లా కన్వీనర్ &ఆదివాసీ సేన రాష్ట్ర నాయకులు ఊకె రవి మాట్లాడుతూ ఆదివాసీ నవనిర్మాణ సేన తీసుకున్న క్విట్ ఏజెన్సీ డిమాండ్ ఆదివాసీ అస్థిత్వాన్ని నిలబెట్టే డిమాండ్ అన్నారు.1950 లో రాజ్యాంగం ఏజెన్సీ డిక్లరేషన్ ఆదివాసీలకు మాత్రమే చేసిందన్నారు.రాజ్యాంగ విరుద్ధంగా వస్తున్న గిరిజనేతరులను ఏజెన్సీ నుండి తరిమి కొట్టే విధంగా అన్ని ఆదివాసీ సంఘాలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివాసీ నవనిర్మాణ సేన చేపడుతున్న ఉద్యమానికి ఈ ప్రాంత ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ బానిసత్వాన్ని విడనాడాలని అన్నారు. 5 వ షెడ్యూల్ ప్రాంతాన్ని రక్షించడమే ఆదివాసీల ప్రధాన బాధ్యత అన్నారు. బీఎస్పీ దుమ్మగూడెం మండల కన్వీనర్ సరియం భీమ్ దీక్షకి మద్దతు ఇచ్చారు. ఈ ఉద్యమానికి బీఎస్పీ చివరి వరకు నిలుస్తుందని హామీ ఇచ్చారు.ఆదివాసీ సేన జిల్లా కో కన్వీనర్ కారం రమేష్, ఆదివాసీ సేన విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్శా నరేష్,ఆదివాసీ కార్మిక సేన భద్రాద్రి జిల్లా కన్వీనర్ శేట్టిపల్లి శ్రీను,దుమ్ముగూడెం మండల అధ్యక్షులు కాటబోయిన శ్రీను, కుంజ ప్రసాద్,పాల్వంచ మండల ఉపాధ్యక్షుడు పాయం నాగార్జున,కొరస శ్రీను,పాయం వెంకటేష్,పెనుబల్లి హరీష్ ఒంటిమామిడి, మహితాపురం, చిరుతపల్లి గ్రామాల ఆదివాసీలు దీక్షలో పాల్గొన్నారు.

Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments