రిపబ్లిక్ హిందుస్ధాన్ , ఇచ్చోడ : ఇచ్చోడ మండల కేంద్రంలో ఓ లారీలో సరైన పత్రాలు లేకుండా , పిడిఎస్ బియ్యం ఉన్న సంచులు చింపి వేరే సంచుల్లో లోడ్ చేసిన లారీని పోలీసులు అదుపులో తీసుకున్నారు. కోవిడ్ సంకటం లో వేలం వేసిన బియ్యం అని డిటిడబ్య్లుఓ కంప్యూటర్ ఆపరేటర్ ఓ జిరాక్స్ లెటర్ ను ఇచ్చారు. అయితే ఆ లెటర్ లో మాత్రం టెండర్ పిలుస్తున్నట్లు ఉంది.
Thank you for reading this post, don't forget to subscribe!
కానీ ఇదే అనుమతి పత్రం అని పేర్కొనడం గమనార్హం. క్వింటాల బియ్యం అని ఉండగా లారీలో సుమారు 170 క్వింటాలుకు పైగా బియ్యం ఉందని డ్రైవర్ తెలిపారు. ఆగస్టు నెలలో ఆ బియ్యం టెండర్ లో దక్కించుకున్నట్లు ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ పాల్ పేర్కొంటున్నారు. అయితే సంచులు చింపి ఎక్కడో జరిగిన టెండర్ బియ్యం ఇచ్చోడాలో ఓ గోదాములో ఎలా ప్రత్యేకం అయిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇది చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజల నుండి కొనుగోలు చేసిన బియ్యమని అంటున్నారు. ఇక్కడ స్థానిక ఇద్దరు ముగ్గురు వ్యాపారులు ఇదంతా నడిపిస్తున్నారని అంటున్నారు.
రేపు విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తాం…..
విచారణ చేసి రేపు పూర్తి వివరాలు వివరిస్తామని ఇచ్చోడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు , ఎస్సై ఫరీద్ తెలిపారు.
Recent Comments