డప్పు చప్పుల మధ్యన ఘనంగా పాలాభిషేకం
రిపబ్లిక్ హిందుస్థాన్ ,ఇచ్చోడ : మండలంలోని జామిడి గ్రామంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చిత్ర పటలాకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. గిరిజన, ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. గ్రామస్తులు డప్పు చప్పుల్ల మధ్య ఘనంగా పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమములో పిఏసిఎస్ వైస్ చైర్మన్ & మాజీ సర్పంచ్ రాథోడ్ సుభాష్, ఎంపీటీసీ సుద్దవార్ నాగవేణి వెంకటేష్, జామిడి విడిసి ప్రెసిడెంట్ హారన్ మారుతి పటేల్, రైతు బంధు అధ్యక్షుడు ముస్తఫా, బి గోవింద్, కిల్లారే సందీప్, పి అశోక్, రామేశ్వర్ యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Recent Comments