*డిసెంబర్ 31 అర్ధ రాత్రి డీజే లకు అనుమతి లేదు.*
*రాత్రి ఒంటిగంట తర్వాత ప్రజలు రోడ్లపై సంచరించడానికి అనుమతి లేదు.*
*అర్ధరాత్రి ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ల నిర్వహణ.*
* జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
2024 నూతన సంవత్సర వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ప్రజలెవరు రోడ్లపై సంచరించకుండా ఉండాలని సూచించారు. ప్రజలు వేడుకలు నిర్వహించే సమయంలో డీజే సౌండ్ బాక్స్ లను అమర్చడానికి అనుమతులు లేవని స్పష్టం చేశారు. పోలీసు శాఖ ద్వారా తెలియజేసిన నియమ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలను నడపకుండా ఉండాలని, అర్ధరాత్రి ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించబడతాయని తెలియజేశారు. ప్రజలు, యువత రోడ్లపై, జాతీయ రహదారులపై మరియు ప్రధానమైన కూడళ్ల వద్ద సంబరాలను నిర్వహించవద్దని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధను వహించి పిల్లలు నిర్వహించే వేడుకలను, కార్యక్రమాలను, పద్ధతులను తెలుసుకోవాలని సూచించారు. జిల్లా పోలీసులు కు ప్రజలు సహకరించి నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.
Recent Comments