రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ : ఈరోజు బోథ్ మండలంలోని బాబేర గ్రామపంచాయతీలో ఆదివాసీల ఆరాధ్యదైవం ఎల్లమ్మ దేవత ఆలయ ప్రతిష్టాపనకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన తులసి శ్రీనివాస్ ఎంపీపీ బోథ్,… రాధా రాథోడ్ ఎంపీడీవో, సిఐ నైలు , ఎస్సై రాజు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆదివాసులు అందరూ ఏకతాటి పైకి వచ్చి ఆలయ నిర్మాణం చేపట్టి నందుకు సర్పంచ్ సురేష్ ను, గ్రామస్తులను మరియు 14 గ్రామ పంచాయతీల నుండి వచ్చినటువంటి గ్రామ పటేల్ లను అభినందించారు.

ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలకి వారి సన్మానం చాలా ఆనందాన్నిచ్చాయని అన్నారు. అలాగే ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయం ఉంటుందని ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను మీ వరకు చేరే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
ఆలయం వరకు వెళ్లడానికి రహదారి సౌకర్యం లేక ఉపాధిహామీ నిధుల నుండి రూ 8 లక్షలతో రహదారి నిర్మాణం కొరకు పనులు చేపట్టాలని ఎంపీడీవో ను ఆదేశించారు. ఆలయ చుట్టుపక్కల చెట్లు నాటారు. గ్రామాల్లో 100% వ్యాక్సినేషన్ వేసుకోవాలని అన్నారు. అన్ని విధాలుగా ఎల్లమ్మ దేవత ఆలయం ను అభివృద్ధిలో పాలుపంచుకుంటామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ ప్రశాంత్, ఎంపీటీసీలు లింబాజి, వైస్ ఎంపీపీ కురుమే మహేందర్, షేక్ రజియా బేగం, జుగాది రావు, మహిపాల్, రోహిదాస్, సర్పంచులు సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి. మరియు సర్పంచ్ లు విజయ్,బాబూసింగ్,నందు కేశవ్, దేవేందర్, లింగు, పాల్గొన్నారు.


Recent Comments