రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని గుండాల గ్రామంలో ని శాంతిభద్రతల ను జిల్లా నూతన ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి బుధవారం సాయంత్రం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పరిస్థితులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

బాధితులతో మాట్లాడి వారి కుటుంబాలకు తగు న్యాయం చేకూరుస్తానని భరోసా కల్పించారు. గ్రామంలో ప్రస్తుతం శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవలి నిందితులకు హైకోర్టులో సైతం బెయిల్ నిరాకరించబడినదని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ తోపాటుగా ఇచ్చోడ, సిరికొండ పోలీసులు మరియు సాయుధ పోలీసులు గుండాల గ్రామాన్ని సందర్శించారు.


Recent Comments