సిరిచేల్మ మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని అధికారులతో కలిసి దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ..
రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఈ రోజు ( సోమవారం) ఇచ్చోడ మండలంలోని కాకతీయుల కాలం నాటి కొన్ని వేల సంవత్సరాల పురాతన స్వయంభూగా వెలిసిన శివాలయం సిరిచెల్మ మల్లిఖార్జున స్వామి ఆలయన్నీ దేవాదాయ శాఖ అధికారులతో కలిసి దర్శించుకున్నారు.



అనంతరం ఆలయ అభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయలతో భక్తుల సౌకర్యార్థం ప్రణాళిక ఏవిందగా చేయాల అనేది స్థానిక ప్రజలతోపాటు అధికారులతో చర్చించారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ ద్వారా ఏర్పాటు చేసిన మినీ ఫంగ్షన్ హాల్ ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు ప్రారంభించారు రాబోయే రోజుల్లో సిరిచెల్మ గ్రామానికి ఇచ్చోడ నుండి సిరిచెల్మ వరకు 40 కోట్లతో డబుల్ రోడ్డు పనులు కూడా చేపడతామని అన్నారు దీనితో పాటు సిరిచెల్మ నుండి పెంబి రోడ్డు కూడా నిర్మించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు సిరిచెల్మ గ్రామానికి భక్తి ఆధ్యాత్మికనికి నిలయంగా మరుస్తానీ అన్నారు.
ఈ కార్యక్రమంలో
వివిధ మండలాల నాయకులు గ్రామస్తులు,ఆలయాల కమిటీ సభ్యులు అభిమానులు తదితరులు ఉన్నారు..


Recent Comments