Wednesday, June 25, 2025

ప్రైవేట్ వ్యక్తులకు వాహనాలు ఆపే అధికారం లేదు – ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి

*చట్ట వ్యతిరేకంగా ప్రైవేటు వ్యక్తులు వాహనాలు ఆపిన, తనిఖీ చేసిన, ధ్రువపత్రాల పరిశీలన చేసిన, డబ్బులు వసూలు వారిపై కఠిన చర్యలు తప్పవు….

*అధికారుల ప్రైవేటు డ్రైవర్లు వాహనాలు ఆపి ధ్రువపత్రాలను పరిశీలిస్తే చర్యలు తప్పవు….

*బోరజ్ చెక్పోస్ట్ వద్ద మోటార్ వెహికల్ అధికారి డ్రైవర్ వాహన ధ్రువపత్రాల పరిశీలనకు పాల్పడడంతో కేసు నమోదు…..
అదిలాబాద్: వాహనాల తనిఖీ సందర్భంలో ఏ శాఖ అధికారి అయిన స్వయంగా తానే వాహన తనిఖీలు, వాహన ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించాలని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు.

ఏ శాఖ కు సంబంధించిన వ్యక్తులు అయినా ఆ శాఖకు సంబంధించిన అధికారులు, శాఖ సిబ్బంది మాత్రమే వాహనాల తనిఖీలకు కానీ, వాహన ధ్రువపత్రాల తనిఖీకి, పరిశీలించాలని, జరిమానాలు విధించడానికి, ప్రైవేటు డ్రైవర్ల కు, వ్యక్తులకు వాహనాలు ఆపడానికి, తనిఖీకి అనుమతులు ఉండవని ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు.

శనివారం బోరజ్ చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్న ఒక ఎంవిఐ అధికారి ప్రైవేట్ డ్రైవర్ *యుగంధర్* ప్రైవేటు వ్యక్తి వాహనాలు ఆపి ధ్రువపత్రాల అడగ్గా  హైవే పెట్రోల్ గమనించి జైనథ్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా అతనిపై క్రైమ్ నెంబర్ 66/25 తో u/sec 126(2),308(2)r/w బి.ఎన్.ఎస్ తో కేసు నమోదు చేయబడిందని, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్  ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గల చెక్పోస్టుల నందు, టోల్ ప్లాజా ల నందు ప్రైవేటు వ్యక్తులు, అధికారుల ప్రైవేట్ డ్రైవర్లు వాహనాల ఆపడానికి, తనిఖీకి, అనుమతులు ఉండవని తెలిపారు.

గతంలో బోరజ్ చెక్పోస్ట్ వద్ద గత జిల్లా ఎస్పీ వాహనాన్ని ఆపిన కమర్షియల్ టాక్స్ అధికారులు నియమించుకున్న ప్రైవేట్ వ్యక్తులపై జైనథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయడం జరిగిందని గుర్తు చేశారు.

ఇకనుండి ఏ శాఖ అధికారికి సంబంధించిన ప్రైవేటు వ్యక్తులు అనధికారంగా వాహనాలు ఆపిన, తనిఖీలకు పాల్పడిన వారిపై మరియు సంబంధిత అధికారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారని ఆదిలాబాద్ డిఎస్పి తెలిపారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి