◾️ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో దంపతులకు జైలు శిక్ష జరిమానా విధించిన ఫోక్సోకోర్ట్ న్యాయమూర్తి
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ – క్రైం న్యూస్ :
వివరాలలో ఇచ్చోడ మండలంలోని ఒక గ్రామం నందు 14 సంవత్సరముల మైనర్ బాలిక తన తల్లి అన్నలతో కలిసి నివసిస్తోంది. వ్యవసాయ కూలీగా పనికి వెళ్ళింది అందులో భాగంగానే ఆమెతో భార్యాభర్తలు కలిసి అని తీసుకువెళ్లినారు. అమ్మాయితో పరిచయం పెంచుకున్నారు.
తేదీ 4.4.2017 ఉదయం పొలం పనులకు వెళ్లగా ముర్కుటే బాలాజీ (33) s/o సంభాజీ ఇతని భార్య ముర్కుటే రేఖ (30) నివాసం భూతాయి గ్రామం మండలం కు చెందినవారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాధితురాలికి మత్తు కలిపిన అన్నం తినిపించి రేఖ తన భర్త బాలాజీకి రూ.1000 ఇచ్చి అట్టి మైనర్ బాలికను తన భర్తతో పంపించగా భర్త బాలాజీ బాధితురాలని మహారాష్ట్రలోని పెంద్రా గ్రామానికి తీసుకువెళ్లి తన బంధువుల ఇంటి వద్ద ఉంచి అట్టి రాత్రి లో బాధితురాలిపై మానభంగం చేసినాడు.
బాధితురాలు కనబడకపోయి సరికి ఇంటికి రానందున ఆమె అన్న రేఖను నిలదీయగా ఆమె చెప్పిన విషయం ప్రకారం పెంద్ర గ్రామం వెళ్లి వెతకగా బాధితురాలు మరియు బాలాజీని పట్టుకొని ఇచ్చోడా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి దరఖాస్తు ఇవ్వగా, ఇచ్చోడ ఎస్సై క్రైమ్ నెంబర్ 49/2017 U / sec 366-a,376(2)(1)r/w 109 IPC, Sec 4 pocso చట్టం మరియు 3(2)(v) of SC ST POA ACT కింద కేసు నమోదు చేయగా ఇట్టి కేసులో బాధితురాలని హాస్పిటల్కు పంపి పరీక్షలు నిర్వహించి అనంతరం బాధితురాలి వాంగ్మూలము కూడా కోర్టు యందు నమోదు చేయించి బాధితురాలు ఎస్టి నాయక కోడ్ కావున అప్పటి డిఎస్పి ఉట్నూర్ చంద్ర ప్రభు సాక్షాలు సేకరించి చార్జీ దాఖలు చేయగా కోర్టు డ్యూటీ అధికారి బిఎస్ గౌతమ్ 9 మంది సాక్షులను కోర్టు యందు ప్రవేశపెట్టగా ప్రత్యేక ప్రత్యేక పిపి ముసుకు రమణారెడ్డి సాక్షులను కోర్టు యందు విచారించి నేరము రుజువు చేయగా ఈరోజు ఫోక్సొకోర్టు న్యాయమూర్తి శ్రీమతి శ్రీ డి మాధవి కృష్ణ తీర్పు విరవరిస్తూ మొదటి నేరస్థుడు మురుకుటె బాలాజీ సెక్షన్ 376 (2)(1) కింద ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష రూ 2000/- జరిమానా, మరియు కిడ్నాప్ సహకరించినందున ముర్కుటే రేఖ 366 ఏ కింద మూడు సంవత్సరాలు సాధారణ శిక్ష రూపాయలు వెయ్యి జరిమానా విధించారు.
ప్రత్యేక పిపి ముస్కు రమణారెడ్డి కోర్టు డ్యూటీ అధికారి లైసెన్ అధికారులను జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
Recent Comments