Wednesday, February 12, 2025

విడిన ల్యాబ్ టెక్నీషియాన్ మర్డర్ మిస్టరి

◾️ రాంనగర్లో అదృశ్యమయి గుడిహత్నూర్లో శవమై తేలిన మిస్టరి మర్డర్ కేసును చేదించిన మావల పోలీసులు

◾️ అక్రమ సంభందమె హత్యకు కారణం

◾️ పత్రికా సమావేశం లో వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ – క్రైం న్యూస్ :
తేది 28.09.2022 రోజున సాయంత్రం 5.30 గంటలకు రాంనగర్ ఇంటి నుండి బండారి కిరణ్ కుమార్ తండ్రి మల్లేష్,వయస్సు 33 సం.రాలు, కులము నేతకాని, వృత్తి ల్యాబ్ టెక్నిషియన్, నివాసం రాంనగర్, ఆదిలాబాద్. ఇతను రాంనగర్ నుండి ద్వారకనగర్లోని ల్యాబుకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళి తిరిగి రాత్రి ఇంటికి రానందున ఇతని భార్య భాగ్యశ్రీ రాత్రి 12.00 గం.లకు భర్త కిరణ్ కుమార్కు ఫోన్ చేయగా నేను తన స్నేహితులతో హైదారాబాద్కు వెళ్తున్నాను అని చెప్పినాడు. మరుసటి రోజు అనగా తేదీ 29.09.2022 రోజున ఉదయం 6.00 గం.ల ప్రాంతంలో అతని భార్య భాగ్యశ్రీ, కిరణ్ కు ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయినది. తన భర్త ఆచుకి గురించి బందువుల ఇండ్లలో, చుట్టు ప్రక్కల వెతుకగా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. కావున తేది 01.10.2022 రోజున మావల పోలీస్ స్టేషన్ నందు క్రైం నెం. 183/2022 మిస్సింగ్ కేసును నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది.

తేది 08.10.2022 రోజున గుడిహత్నూర్ మండలములోని పాత యన్.హెచ్.7, దాంపూర్ రోడ్డు వద్ద గల డంపింగ్ యార్డుకు సమీపములో గల అడవిలో గుర్తు తెలియని మగ శవమును పాతిపెట్టబడి ఉన్నదని అట్టి విషయమై గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ నందు క్రైం నెం. 115/2022 అనుమానస్పద మృతి కేసు నమోదు కాగ అట్టి మృతిదేహాన్ని చూసి కిరణ్ కుమార్ బందువులు అతనిదే అనే గుర్తు పట్టినారు.

మృతుడు కిరణ్ కుమార్కు 7 సం.రాల క్రితము భాగ్యశ్రీతో ప్రేమ వివాహము జరిగినది. వీళ్ళకు ఇద్దరు పిల్లలు అనగా కూతురు 6 సం.రాలు, కుమారుడు 4 సం.రాలు కలదు.

మృతుడు బండారి కిరణ్ కుమార్కు వరుస కోడలు అయిన తోషం గ్రామానికి చెందిన తాళ్ళపెల్లి రమ్యతో గత 4 సం.రాల నుంచి పరిచయం కలదు. పరిచయం కాస్త ప్రేమగా మారి అక్రమ సంబందంకు దారి తీసినది. ఆ విషయములో వారి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉండేవి.

ఈ అక్రమ సంబందం గురించి రమ్య వాళ్ళ అన్న అయిన తాళ్ళపెల్లి శివకుమార్, రమ్య మేనమామ అయిన బండారి సంతోష్, రమ్య వాళ్ళ బాబాయి అయిన తాళ్ళపెల్లి రమేష్ లు కిరణ్ కుమార్ను ఇంతకు ముందు చాలా సార్లు నీవు రమ్య జోలికి రావద్దని కిరణ్ కుమార్ని బేదిరించినారు.

తేది 16.09.2022 రోజున రమ్య, కిరణ్ కుమార్లు ఆదిలాబాద్ లో తిరిగి చాందా గ్రామం దగ్గర గల రామాలయం వద్ద దండలు మార్చుకున్నారు.

ఇట్టి విషయము తెలుసుకున్న రమ్య బాబాయి తాళ్ళపెల్లి రమేష్, రమ్య వాళ్ళ మేనమామ బండారి సంతోష్, రమ్య వాళ్ళ అన్నయ్య తాళ్ళపెల్లి శివకుమార్లకు ఫోన్ ద్వారా రమ్యతో కిరణ్ కుమార్ (మృతుడు) అక్రమ సంబందం పెట్టుకొన్నాడని తెలిపి ఎలాగైన కిరణ్ కుమార్ ను చంపాలని చెప్పాడు.

ఆ తర్వాత కూడా తాళ్ళపెల్లి రమేష్, శివకుమార్, సంతోష్ తో చంపడానికి గల ప్లాన్ ఫోన్లో మాట్లాడుకున్నారు. బండారి సంతోష్ మరియు తాళ్ళపెల్లి శివకుమార్ వీరు ఆర్మీలో ఉన్నందున మేమిద్దరము త్వరలో వచ్చి కిరణ్ కుమార్ని చంపుదామని చెప్పినారు.

తేది 27.09.2022 రోజున తాళ్ళపెల్లి శివకుమార్ పంజాబ్ నుండి హైదరాబాద్కు వచ్చి బండారి. సంతోష్ వాళ్ళ మిత్రుడు అయిన హైదారాబాద్ కు చెందిన చింతల రోహిత్ రెడ్డితో కలిసి హైదారాబాద్లో ఓయో హెూటల్ రూంలో కలిసి ఉన్నారు. ఆ తర్వాత సిగ్గం రామకృష్ణ రెడ్డి అలియాస్ ఆర్.కె. కూడా వారితో కలిసి చేరాడు. అక్కడే వాళ్లందరు కలిసి మద్యం సేవించారు.

తేది 28.09.2022 రోజున బండారి సంతోష్ గుజరాత్ నుండి హైదరాబాద్ కు వచ్చి తాళ్ళపెల్లి శివకుమార్, చింతల రోహిత్ రెడ్డి, సగ్గం రామకృష్ణ రెడ్డిలతో కలిసి ఓయో రూంలో ఉండి చెప్పినాడు, తాళ్ళపెల్లి శివకుమార్ చెల్లి అయిన రమ్యను బండారి కిరణ్ కుమార్ అక్రమ సంబందం పెట్టుకున్నాడని దాని ద్వారా కుటుంబం పరువుపోతుందని ఎలాగైన కిరణకుమార్ను చంపాలని ఇందుకు గాను చింతల రోహిత్ రెడ్డి మరియు సగ్గం రామకృష్ణ రెడ్డిలకు చెరో రూ.50,000/- లు ఇస్తానని అలాగే ఇందు కోసం ఒక కారు మాట్లాడు అని చింతల రోహిత్ రెడ్డికి తెలుపుగా అతడు వాడు అతని స్నేహితుల ద్వారా ‘Maruti Swift Desire bearing No. AP39FV1471 ను తీసుకొని హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ కు బయలు దేరినారు. మార్గ మద్యంలో టోల్ ప్లాజా వద్ద బండారి సంతోష్ యొక్క ఆర్కి కార్డును చూపిస్తూ వచ్చారు.

మార్గమధ్యంలో తాళ్ళపెళ్లి రమేష్ కు ఫోన్ చేసి నీవు గడ్డపార, పార తీసుకొని గుడిహత్నూరు రమ్మని చెప్పారు. తాళ్ళపెల్లి రమేష్ తన మోటర్ సైకిల్ Hero HF Delux bearing No. TS01EJ3914 పై తీసుకొని, గడ్డపార తీసుకొని మార్గ మద్యలో ఉన్నాడు.

గుడిహత్నూర్ దగ్గరలో వారందరు కలుసుకొని తాళ్ళపల్లి శివకుమార్, సగ్గం రామకృష్ణ, తాళ్ళపెల్లి రమేష్ కు గుడిహత్నూర్ డంపింగ్ యార్డు సమీపంలో దించినారు. వీరు కిరణ్ కుమార్కు సరిపోయంత బొంద తీయమని చెప్పి బండారి సంతోష్, చింతల రోహిత్ రెడ్డిలు ఆదిలాబాద్కు వస్తారు. వీరు అనుకున్న పతకం ప్రకారం ద్వారాకనగర్ లోని ల్యాబ్ నుండి బండారి కిరణ్ కుమార్ను వాళ్ళు కార్లో ఎక్కుంచుకొని అతనికి మద్యం సేవింపజేసి, మద్యంలో మత్తు మందు కలిపి అతనిని గుడిహత్నూర్లోని డంపింగ్ యార్డు వద్దకు ముందుగా తవ్వి పెట్టుకున్న బొంద వద్దకు తీసుకొని వెళ్ళి వారి వెంట తీసుకెళ్ళిన పొరతో బండారి సంతోష్, కిరణ్ కుమార్ మర్మంగాలపై కొట్టి అదే సమయంలో శివకుమార్ కిరణ్ కుమార్ యొక్క గొంతు పిసుకగ కిరణ్ కుమార్ చనిపోయినాడు. ముందుగా త్రివ్వి ఉంచిన బొందలోనే పాతి పెట్టి ఎవరికి అనుమానం రాకుండా వాళ్ల వెంట తీసుకొని వచ్చిన పార, గడ్డపారతో సహా రమేష్ మోటార్ సైకిల్ వెళ్ళినారు. నిన్నటి రోజు అనగా తేది 18.10.2022 రోజున జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సి.ఐ. ఆదిలాబాద్ రూరల్ ప్రత్యేక టీం. తయారు చేసి తాళ్ళపెల్లి రమేష్ ను తన ఇంటి వద్ద ఇన్కర్ గూడ, తోషం వద్ద పట్టుకొని విచారించగా పై విషయం ఒప్పుకున్న వెంటనే సి.ఐ. ఆదిలాబాద్ రూరల్ గారి ఉత్తర్వుల మేరకు యస్.ఐ. మావల అతని సిబ్బందితో హుటాహుటిన హైదారాబాద్ కు బయలు దేరి రాత్రికి రాత్రే చింతల రోహిత్ రెడ్డి మరియు సగం రామకృష్ణ రెడ్డిలను అరెస్టు చేసినారు. ఇంకా ఆర్మీవాళ్లు అయిన బండారి సంతోష్ మరియు తాళ్ళపెళ్లి శివకుమార్ ఆచూకి కోసం వెతుకుతున్నారు.

*Name of the Complainant*

Bandari Bhagya Sri w/o Kiran Kumar, age 27 yrs. caste: Nethakani. Occ: House hold r/o Ramnagar. Adilabad.

*Name of the Deceased:*

Bandari Kiran Kumar s/o Mallalah, age 32 yrs, caste: Nethakani. Occ: Lab Technician r/o Ramnagar, Adilabad.

*Accused Details:*

1). Bandari Santhosh s/o Bapu Rao. Occ: Army n/o Inkarguda. Tosham Village. present at Gujarath.

2). Tallapelly Shiva Kumar s/o Prahlad. Occ: Army n/o Inkarguda. Tosham Village.
present at Punjab.

3). Tallapally Ramesh s/o Shiva Lingu, age 36 yrs, caste: Nethakani, Occ: Mason r/o Inkarguda. Tosham Village.

4). Chintala Rohith Reddy s/o Raja Reddy, age 26 yrs, caste: Reddy. Occ: Job Consultant work. r/o Hyderabad.

5). Saggam Ramakrishna Reddy @ RK s/o Mohan Reddy, age 24 yrs. Occ: Club captain House Jubilee Hills, Hyderabad r/o NLB Nagar, Hyderabad

ఈ సమావేశంలో ఆదిలాబాద్ డిఎస్పీ వి ఉమేందర్, గ్రామీణ సిఐ బి రఘుపతి, మావల ఎస్సై వి విష్ణువర్ధన్, స్టేషన్ సిబ్బంది మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

Translate »
మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి