మైనర్ బాలికపై అ*త్యాచారం కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ క్రైమ్ న్యూస్ :
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితునికి 20 సంవత్సరముల జైలు శిక్ష మరియు 7వేల రూపాయలు జరిమానా విధించిన పోక్సో కోర్టు న్యాయమూర్తి డాక్టర్ పి శివరాం ప్రసాద్ తీర్పు వెలువరించారు.
ఆదిలాబాద్ కు చెందిన జమిల్ ఖాన్ ( 25) అనే వ్యక్తి పిల్లలకు అరబిక్ భాష నేర్పడానికి వారి ఇండ్లకు వెళ్ళేవాడు. అయితే తన ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి నిందితుడి పాఠాలు చెప్పే పిల్లల్ని వారి తల్లిదండ్రుల అనుమతితో వారిని ద్విచక్రవాహనంపై తీసుకెళ్ళాడు. ఇంటికి కొద్ది దూరంలో వెంట తీసుకెళ్లిన అబ్బాయికి మొబైల్ ఇచ్చి గేమ్ ఆడుకో అని చెప్పి ఆరేళ్ళ బాలికను పొదల్లో తీసుకెళ్ళి అ*త్యాచారం చేసి ఇంటి వద్ద దింపేశాడు. అయితే బాలిక ఏడుస్తూ… జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. వారు అప్పటి సిఐ రామకృష్ణ కేసు నమోదు చేయగా ఆదిలాబాద్ డిఎస్పీ వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేపట్టి చార్జిషీట్ దాఖలు చేశారు. పోలీసు అధికారులు కోర్టులో సాక్షులను ప్రవేశ పెట్టగా నేరం రుజువై నిందితుడి శిక్ష పడినట్లు ఏ ఎస్సై & లైజన్ అధికారి పండరి తెలిపారు.
Recent Comments