2018 నుండి అధికారికంగా లంబాడీల ఐక్య వేదిక తండా దర్శన్ కార్యక్రమాలు చేస్తూ ప్రతి సంవత్సరం లంబాడీ ఐక్య వేదిక ( లైవ్ ) సైనికులకు శిక్షణ చేస్తూ ఈ రోజు తెలంగాణ లో జాతి పెద్దల కోసం,జాతి మేధావుల కోసం,జాతి కి అత్యవసర సమయం లో కావాల్సిన పనుల కోసం జాతి పెద్దలను, మేధావులను, నాయకులను, ఉద్యోగులను సమన్వయ పరుస్తు ఎక్కడికి అక్కడ జాతికి అండగా ఉంటున్నరు అని లాంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయ కర్త రమేష్ నాయక్ గుగులోత్ తెలిపారు .
అందులో భాగంగ రాష్ట్ర అధ్యక్షులు డా . రాజ్ కుమార్ జాధవ్ మరియు కోర్ కమిటీ ఆదేశాల మేరకు, ఈ సారి “తండాలను దిశ నిర్దేశం చేయడం లో మేధావుల భాగస్వామ్యము” అనే కార్యక్రమం తీసుకొవడం జరిగింది అని తెలియ జేశారు .
దసరా ఉత్సవాలకు తమ యొక్క పుట్టిన తండాలకు దరి దాపు ప్రతి ఉద్యోగి హాజరు అవుతారు. కావున అలాంటి వారిని మన లైవ్ సైనికులు కలిసి వారితో పరిచయం పెంచుకొని చైతన్య సదస్సులు ఏర్పాటు చేయాలి అని రాష్ట్ర సమన్వయ కర్త రమేష్ నాయక్ పిలుపునిచ్చారు.
చాలా మంది మన గ్వార్ ఉద్యోగులకు తగిన సమయం లేక పండగకు వచ్చే రెండు మూడు సెలవు దినాలలో తమ ఆప్తులను కలవడం లొనే వారి సమయం అయిపోతుంది.కానీ అటువంటి మేధావులను వారి అనుమతి తీసుకొని మన తండా ల కోసం, మన జాతి కోసం, మన జాతి భవిష్యత్ కోసం, మన ఆచార వ్యవహారాలు కాపాడడం కోసం,అలాగే సమకాలీన విషయాల పై వారితో తండా లో చిన్న చిన్న మీటింగ్ లు పెట్టాలి అని పిలుపునిచ్చారు.
మన జాతి ఉద్యోగులు తమ యొక్క వృత్తిపరమైన ప్రదేశాల నుండి తండా లకు ప్రయాణం అయే అప్పుడు తండా కోసం ఏది అయిన ఒకటి చేద్దాము అనే తపన తో చాలా మంది వస్తారు కానీ సరి అయిన వేదికలు లేక తండా విద్యార్థులకు దిశ నిర్దేశం చేయడం లో వారు విఫలం చెంది మరల నిరాశ తో వృత్తి రీత్యా వెనుదిరిగుతారు.అటువంటి వారికి వేదిక ఏర్పాటు చేయాల్సిన బాధ్యత,అలాగే తండా యువకులను,పెద్దలను ఒక దగ్గర కూర్చో బెట్టి మాట్లాడించాల్సిన బాధ్యత లైవ్ సైనికులది మాత్రమే తెలియ చేశారు.
కేవలం రాజకీయ చైతన్య సదస్సులు మాత్రమే ఏర్పాటు చేయాలి, ఎందుకంటే మన జాతి కి కుల చైతన్యం ఉంది అందులో భాగము గానే మన తండా లో మన రాజ్యం స్థాపించుకున్నాము.రాజకీయ చైతన్యం అనగా కుల చైతన్యం ఉన్న జాతిని రాజకీయ శక్తి గా మార్చడం అలాగే ఆ శక్తిని రాజకీయ చైతన్యం చేసి రాష్ట్రం లో రాజకీయ పార్టీ లు గిరిజన పంథా ను ఆమలు చేసే విధముగా ఐక్యం చేసి జాతి ఉనికి కాపాడుకోవడం మాత్రమే.మనం ఎటు మొగ్గితే అటు బరువు పెరిగి రాజకీయలను శాశించే స్థితి కి ఎదగడమే రాజకీయ చైతన్యం.ఎదో ఒక పార్టీ కి కొమ్ము కాయడం రాజకీయ చైతన్యం అస్సలు కాదు ఇది అందరు గమనించాలి అని గుర్తు చేశారు.
3146 తండా పంచాయతీ లకు ఇప్పటి వరకు ఉపాది హామీ నిధులు మాత్రమే వస్తున్నాయి. రాష్ట్ర ఖజానా నుండి వచ్చేది నామ మాత్రమే, రాష్ట్ర నిధులు రావాలి అంటే అవి రెవెన్యూ గ్రామ పంచాయతీ లు అవ్వాల్సిన అవసరం ఉంది వాటిని సాధించుకోవాల్సిన అవసరం ఉందని బాధ్యతను గుర్తు చేశారు.
అలాగే తెలంగాణ వచ్చిన తరువాత విద్య, ఉద్యోగాలు, మరియు ఇతర రాజ్యాంగ బద్ధము అయిన రాజకీయ పదవులలో రెజర్వేషన్ శాతం పెంచక పోవడం వలన జరిగిన నష్టం గురించి అందరికి చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది అని గుర్తు చేశారు.
అలాగే మన గోర్ పండగలు అయిన శీతల, తీజ్, సేవాలాల్ మహరాజ్ జయంతులకు సెలవు దినాలు ప్రభుత్వం ఇస్తాను అని ఇప్పటి వరకు ఇవ్వలేదు అవి సాధించడం కోసం సరి అయిన కార్య చరణ కూడా చర్చించాలి అని మనవి చేశారు.
మన యొక అంతిమ లక్ష్యం సేవాలాల్ మహరాజ్ మాటలను పూర్తి చేయడం అందుకోసం ప్రతి ఒక్కరు మన జన్మ కర్తవ్యంగా భావించాలి అని తెలియ చేశారు.
దీని కోసం ఎన్ని అవమానాలు ఎదురు అయిన మొక్కవోని దీక్ష తో జాతి కోసము పని చేయాలి అని మనవి చేశారు
జాతి సైనికులు ఈ కార్యక్రమాలు చేసే సమయం లో కాన్షిరం చెప్పినట్లు చెంచా లు మనకు ఎదురు అవుతారు వారు మన వారే కాబట్టి అందరిని సమన్వయపరచుకొని జాతి కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments