ePaper
Thursday, April 30, 2026
📄 ePaper

తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ

📰 Generate e-Paper Clip

రైతు నేస్తం, రైతు భరోసా కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభోత్సవం:

తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ

ప్రభుత్వం రైతు సంక్షేమానికి , అభివృద్ధికి కట్టుబడి ఉంది:

సన్న వడ్లకు 500 బొనస్ ఇవ్వడం జరిగింది:

1031రైతువేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం

రైతులకు వ్యవసాయం లాభసాటిగా ఉండాలి:

సాంకేతిక నైపుణ్యం, సోలార్ పై రైతులకు అవగాహన కల్పించాలి:

రాష్ట్రం లో రైతులు 6 లక్షల 40 వేల  మంది:

రాష్ట్ర  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

రైతు నేస్తం కార్యక్రమం లో భాగంగా 1031 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం  కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సోమవారం  లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని
తలమడుగు మండలం సుంకిడి రైతువేదిక నుండి పాల్గొనీ మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా .

రైతులు   వ్యవసాయ విస్తరణ అధికారులు నిపుణులతో సంభాషించడానికి వీలు కల్పించే విధంగా వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం రైతునేస్తం ను సోమవారం  తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ,వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావ్ ప్రారంభించారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ
రైతులు ఎన్నో కష్టాలతో ఆరుకాలం శ్రమించి పంటలను పండించే రైతన్నలు అందరికీ ఆహారం అందించే విధంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని,  వర్షాలు ఎక్కువ వచ్చిన కరువులు వచ్చిన నీరు ఉన్నా లేకపోయినా వీటన్నిటిని ఎదుర్కొని  గుండె ధైర్యంతో రైతు పంటలను పండిస్తున్నారని, మన తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం తో  రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని,  ఈ కార్యక్రమాలు అన్ని కూడా రైతులు సంపన్నులు కావాలనే లక్ష్యం తో ముందుకెళుతున్నదని,  రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉన్నారనీ, వారి ఆదాయం పెంచే విధంగా ఇంకా ఎక్కువ నిధులు సమకూర్చి పల్లె పట్టణాల ప్రాంతాల్లో పాడి పంటలుతో సంపాదన చేకూరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని , ఆరు లక్షల 40 వెల మంది రైతులు రైతు నేస్తం, రైతు భరోసా కార్యక్రమాన్ని పండగ వాతావరణం లో  ప్రత్యక్షంగా విక్షిస్తున్నారన్నారు
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రైతులను రాజు చేయడానికి వ్యవసాయం పండుగ చేయాలన్న ఉక్కు సంకల్పంతో చేస్తున్న ప్రయత్నాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన రైతంగ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని  ఆన్నారు.


జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్  వ్యవసాయ విశ్వ విద్యాలయం నుంచి ముఖ్యమంత్రి ,  క్యాబినెట్ మంత్రి వర్గం మంత్రివర్యులు అందరూ కూడా హైదరాబాద్ నుంచి రైతు వేదికలలో రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు

జిల్లాలో కూడా ఇక్కడ రైతు వేదిక సుంకిడి  నుంచి ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగిందనీ, ఇది చాలా మంచి కార్యక్రమం ఇప్పటివరకు ప్రతి మండలంలో రైతు వేదికలు ప్రారంభించడం జరిగింది రైతు వేదిక ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుండి సైంటిస్టులు రైతులు రైతువేదికలలో సేంద్రియ పద్ధతులు పంటను సాగు చేయడం ఎరువులు , పంట మార్పిడి , తదితర వాటి పై సలహాలు, సూచనలు రైతులకు అందిస్తున్నారని ఆన్నారు.
ముఖ్యంగా ఈ రోజు నుండి ఏడు రోజులలో రైతుల ఖాతాలో రైతు భరోసా కూడా ఎకరానికి 12,000 జమ అవుతాయని, ఇప్పుడు రైతులందరూ పొలంలో ఉన్నారు కాబట్టి వారికి పెట్టుబడి సహాయం సకాలంలో అందుతుందని,  దీని వలన రైతులు సకాలంలో సాగు చేసి మంచి దిగుబడికి పెంచుకోవడానికి సహాయపడుతుందన్నారు.

ఈ సందర్భంగా రైతువేధికల్లో  వీడియో కాన్ఫరెన్స్ సంభాషణ ద్వారా, రైతులు తమ ఉత్పాదకతను మెరుగు పరచుకోవడానికి వ్యవసాయ రంగంలో ఉత్తమ పద్ధతులను నేర్చుకోవడానికి దోహద పడుతుందని జిల్లా కలెక్టర్ ఆన్నారు.

జిల్లాల నుండి రైతులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొని వ్యవసాయ పద్ధతుల్లో తమ అనుభవాలను, లాభాలను పంచుకున్నారు.

ఈ కార్యమం లో  మాజీ జడ్పీటీసీ గణేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ కల్యాణలక్ష్మి రాజేశ్వర్, సీఈఓ పి ఎ సి ఎస్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, ప్రత్యేక అధికారి గజనన్, రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, ,తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారిణి అదిలాబాద్ గారి చే జారీ చేయనైనది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88