*ఇచ్చోడ పోలీస్ మరియు షీ టీం బృందం స్పెషల్ ఆపరేషన్.*
*బాధితురాలని శారీరకంగా మరియు మానసికంగా వేధించిన యువకులు.*
*గుడియత్నూర్ పోలీస్ స్టేషన్ నందు నిందితులపై పోక్సో కేసు నమోదు.*
*నిందితులలో ఇద్దరు మైనర్లు, ఆరుగురు మేజర్లు.*
*నిందితుల వద్ద నుండి ఏడు మొబైల్ ఫోన్ లు స్వాధీనం.*
*మహిళలకు అండగా ఆదిలాబాద్ షీ టీమ్ బృందం.*
*షీ టీం కొరకై 8712659953 నెంబర్ కు సంప్రదించండి.*
*ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్*
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్/ఇచ్చోడ :
*అభియోగము పొందిన వ్యక్తుల పేర్లు:-*
1) మైనర్, s/o రుక్మాజీ. వయస్సు: 16 సంవత్సరాలు.
2) మైనర్, s/o శంకర్, వయస్సు: 15 సంవత్సరాలు.
(మైనర్లను ఇద్దరినీ ప్రత్యేకంగా రిమాండ్ సీడీతో గౌరవనీయ జువెనల్ కోర్ట్ జడ్జి, ఆదిలాబాద్ ముందు హాజరు పరచడం జరిగింది).
A1) సజ్జన్వార్ వంశీ కృష్ణ(20) , s/o సజ్జన్వార్ బ్రహ్మం.
A2) పవార్ తరుణ్(18) , s/o పవార్ ఐనేశ్ @ దినేశ్.
A3) సాబ్లే బాలవంత్ సింగ్(18) , s/o సాబ్లే లఖన్ సింగ్.
A4) గుండల్వార్ వరుణ్(18), s/o గణపతి.
A5) కారడ్ సుధీర్(28), s/o కారడ్ తుల్సిరామ్.
A6)ముర్కుటే విట్టల్(23), s/o విష్ణు.






వివరాలలో ….. ఒక మైనర్ అమ్మాయితో చిన్ననాటి నుండి స్నేహం పేరుతో దగ్గరై అమ్మాయితో సోషల్ మీడియా నందు సెల్ ఫోన్ సహాయంతో మైనర్ యువకుడు చాటింగ్ చేయడం జరిగింది, ఆ మైనర్ అమ్మాయితో చేసిన చాటింగ్ ను తల్లిదండ్రులకు ప్రజలకు తెలియజేస్తానని బెదిరించి, అమ్మాయితో నగ్నంగా వీడియో కాల్ చేయాలని బెదిరించి, దానిని రికార్డు చేసి, మైనర్ అమ్మాయి వీడియోను తన స్నేహితులకు ఒకరి తర్వాత ఒకరికి పంపించి రాక్షసానందం పొంది, అమ్మాయిని లైంగికంగా మరియు మానసికంగా వేధించిన ఎనిమిది మందిపై గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ నందు పోక్సో కేసు నమోదు అయిందని ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్ తెలిపారు. వివరాలలో మైనర్ బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు అయింది, మైనర్ బాధితురాలిని స్నేహం పేరుతో సోషల్ మీడియా నందు చాటింగ్ చేసిన మైనర్ యువకుడు, ఈ చాటింగ్ ఆధారంగా మైనర్ అమ్మాయిని వేధించడం బ్లాక్మెయిలింగ్ కి పాల్పడుతూ, తనతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడాలని లేనియెడల చాటింగ్ తల్లిదండ్రులకు ప్రజలకు సోషల్ మీడియా నందు ఉంచుతానని బెదిరించగా, బాధితురాలు నగ్నంగా వీడియో కాల్ చేసిన సందర్భాన్ని రికార్డు చేసుకుని తన స్నేహితులైన మిగిలిన నిందితులతో పంచుకొని రాక్షసానందాన్ని పొందడం జరిగింది.

ఈ సందర్భంగా నిందితులు మహిళను వేధించడం, మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం, మహిళను లైంగికంగా వేధించడం లాంటివి చేయడంతో షీ టీం బృంద సహాయంతో, గుడిహత్నూర్, ఇచ్చోడ పోలీసులు సీఐ బండారి రాజు ఆధ్వర్యంలో పైన పేర్కొన్నటువంటి ఎనిమిది మందిని అందులో ఇద్దరు మైనర్ లను గౌరవ న్యాయమూర్తి ముందు ఉంచగా రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.
మహిళలకు అండగా ఆదిలాబాద్ షీ టీం బృందం ఎల్లవేళలా సహకరిస్తుందని, మహిళలు ఎలాంటి అత్యవసర సమయంలోనైనా 8712659953 నెంబర్ కి సంప్రదించాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలు చేసే పనులపై ఓ కంటితో కనిపెడుతూ ఉండాలని, వారి ప్రతి ఒక్క అంశాన్ని పరిగణిస్తూ ఉండాలని తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments