
రిపబ్లిక్ హిందూస్థాన్ , ఆదిలాబాద్ : తెలంగాణ అనగారిన వర్గాల భీష్మపితామహుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌదరి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన మహానీయుడని కొనియాడారు. బలహీన వర్గాలకు ఆయన ఇల్లే ఆశ్రమ ఆశ్రయం అని అన్నారు. ఖచ్చితత్వం, నిర్మొహమాటం ఆయన తత్వం. నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించి హైదరాబాద్ సంస్థాన పోరాట గొప్పపోరాట నాయకుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో లో శాస్త్రవేత్తలు వి శ్రీనివాస్, ఎస్ మోహన్ దాస్, రాజేందర్ రెడ్డి, అనిల్ కుమార్, శ్రీకాంత్, దేవానంద్, నరేష్ ,రవి పోతన్న, అరుణ్ కుమార్, ఆర్ స్వామి, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు


Recent Comments