Friday, February 7, 2025

Adilabad : లారీ లో బియ్యం సక్రమమైనదే….!?

ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించక ముందే ప్రకటించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారి ….

విచారణ సమయంలో సాక్షలుగా తన వారికి ఫోన్ చేసి సాక్షులు గా సంతకం తీసుకున్న విచారణ అధికారి….

రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చొడ : ఆదివారం రోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం నుండి ఓ లారీలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని పోలీసులకు స్థానిక రెవెన్యూ శాఖ అధికారులకు కొందరు వ్యక్తులు సమాచారం అందించారు. దీనితో ప్రజా పంపిణీ వ్యవస్థ ముద్రణ ఉన్న సంచులు నుండి వేరే సంచుల్లో మార్చిన బియ్యం సంచులతో ఉన్న లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రోజు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టారు.

విచారణ తీరు పై అనుమానాలు….

జిల్లా ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఉదయం వచ్చినప్పుడు ఇది పక్క అక్రమ రవాణా చేస్తున్నా బియ్యం అని పేర్కొన్నారు. అదే విధంగా ఎన్ఫోర్స్మెంట్ టెక్నికల్ అసిస్టెంట్ సైతం ఇది నేను టెస్ట్ చేసిన బియ్యం కాదు అని పేర్కొన్నారు. నేను ముక్కిన బియ్యం టెస్ట్ చేశాను. ఇది మొత్తం నాణ్యత తో కూడిన బియ్యం ఉందని అన్నారు. కానీ విచారణ పత్రం లో మాత్రం అది ముక్కిపోయిన బియ్యం నేను టెస్ట్ చేసిందే అని అనడం కొసమెరుపు.

విచారణ అధికారి మాటల్లోనే వినండి…

“లారీలో లోడ్ చేసిన సుమారు 200 క్వింటాళ్ల బియ్యం మాత్రం నాణ్యత గలా బియ్యం ఉంది….. కానీ అధికారులు ఆ బియ్యాన్ని ముక్కిపోయిన బియ్యం అంటున్నారు”

లారీ నుండి సేకరించిన మంచి నాణ్యత గల బియ్యం ( అధికారులు ఈ బియ్యాన్ని ముక్కిన బియ్యం ( కంది పోయిన బియ్యం) అని, టెస్ట్ చేసి నట్లు పేర్కొన్నారు )

రెండు గంటల తర్వాత విచారణ పత్రం రాసిన అధికారులు బియ్యం తరలిస్తున్న వారి దగ్గర నుండి ఎలాంటి పత్రాలు చూడకుండా నే బియ్యం సరఫరా కు అన్ని అనుమతులు ఉన్నాయని అన్నారు.

ఇతర సంచుల్లో ఉన్న సన్న బియ్యంతో లోడ్ చేసిన లారీ

ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ శాఖ డిప్యూటి తహశీల్దార్ ప్రభాకర్ , టెక్నికల్ అసిస్టెంట్ సుధాకర్ లు చేసిన విచారణ వివరాలు ఇలా ఉన్నాయి. ఆ బియ్యం మధ్యాహ్న భోజన పథకానికి చెందిన బియ్యం అని అన్నారు. ఐటీడీఏ పిఓ ఆధ్వర్యంలో టెండర్ జరిగిందని అన్నారు. ఆ టెండర్ లో వానల్ పాడ్ కు చెందిన మణికంఠ ట్రేడర్స్ కు బియ్యం కోనుగోలు అనుమతి వచ్చినట్లు పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో హాస్టల్ కు సరఫరా చేసిన బియ్యం ముక్కిపోవడంతో వాటిని టెండర్ వేసినట్లు తెలిపారు. విచారణ అధికారులు మొత్తం విషయం రాసుకున్న అనంతరం వారికి తెల్సిన వారిని ప్రత్యేకంగా ఫోన్ చేసి సాక్షులు గా సంతకాలు తీసుకున్నారు. ఎవరిని విచారణ చేయకుండా కాంట్రాక్టర్ తో కలిసి విచారణ ను అధికారులు పూర్తి చేయడం ఆశ్చర్యం నికి గురిచేసింది. లారీ ని పట్టించిన వారికి కనీసం సమాచారం ఇవ్వకుండా వేరే అంటే ఇచ్చోడ బియ్యం గోదాం (ఎం ఎల్ ఎస్ ) పాయింట్ లో పనిచేసే వారిని విచారణ అధికారి స్వతహాగా ఫోన్ చేసి మరీ పిలిచి సాక్షులుగా సంతకాలు తీసుకోవడం ఓకేత్తైతే …. ఎటిడబ్ల్యుఓ సౌజన్య మొదట ఇది మెం సప్లై చేసిన బియ్యం కాదు అని అనడం ఆ తర్వాత అది సక్రమమే అని అనడం , తమ హాస్టల్ నుండి బియ్యం తీసుకొచ్చినట్లు పేర్కొనడం విడ్డురం….

సదరు విచారణ అధికారి సైతం గోదాములో బియ్యం నిల్వవుంచడం తప్పు అని అన్నారు.

అధికారులు చెబుతున్న తీరు ఎవరికి వారు పొంతన లేని సమాధానాల వల్ల సామాన్య జనానికి మరింత అనుమానం కలుగుతుంది. ఎప్పుడు ఆగస్టు లో జరిగిన టెండర్ కు ఇప్పుడు అనుమతి సదరు కాంట్రాక్టర్ ఇచ్చోడ లో నాలుగు నెలల క్రితం నుండి ఓ ప్రవేట్ గోదాం అద్దెకు తీసుకున్నట్లు సమాచారం.

ఏదేమైనా ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!