రిపబ్లిక్ హిందూస్థాన్, ఇంద్రవెల్లి : అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి గ్రామానికి చెందినటువంటి దాహికాంబ్లే శిరీష అనే క్రీడాకారిణి ని సన్మానించారు.
ఇటీవల జరిగిన కరాటే పోటీలో పాల్గొని బ్లాక్ బెల్ట్ -ll డౌన్ లో గెలిచి ప్రముఖ సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నా సందర్భంగా సభ్యులు శిరీష ను సన్మానించారు.
ఈ సందర్బంగా అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాబాసాహెబ్ మరియు జనరల్ సెక్రటరీ నరహరి కాంబ్లే అభినందనలు తెలిపి శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వంచిత్ బహుజన్ జిల్లా అధ్యక్షులు సందీప్ దాండగే, ఉపాధ్యక్షులు నాగసేన్ మాన్కర్, వసీమ్, అనిల్, రాహుల్ లాండగే, శివాజీ కాంబ్లే,మహేందర్ లాండగే మరియు తుకారాం జీవనే తదితరులు పాల్గొన్నారు.


Recent Comments