ePaper
Thursday, February 12, 2026
📄 ePaper

Jobs: డిగ్రీ చదివితే చాలు పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. ఇదిగో డీటెయిల్స్

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

మీకు డిగ్రీ ఉందా? బీటెక్ పాసయ్యారా? అయితే మీ కోసమే ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నంలో యూనిట్లలో 361 పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

ఈ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన (నాలుగేళ్ల ఫిక్స్‌డ్ టర్మ్) ఉంటాయని నోటిఫికేషన్ లో తెలిపారు. మరి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దామా..

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పేర్కొన్న మొత్తం 361 పోస్టుల్లో 136 ప్రాజెక్ట్ ఇంజినీర్/ ఆఫీసర్‌ పోస్టులు, 142 ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్/ అసిస్టెంట్ పోస్టులు, 83 ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్/ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్‌ పాసై ఉండటంతో పాటు పని అనుభవం కూడా ఉండాలి.

విద్యార్హతలో మెరిట్ లిస్ట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 17,18,21,22,25 తేదీల్లో ఎంపిక చేసిన సెంటర్లలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ పోస్టులకు అప్లై చేసే వారి వయస్సు 14.02.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లికేషన్ ఫీజు రూ.300గా, ఇతర పోస్టులకు అప్లికేషన్ ఫీజు రూ.200గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజులో రాయితీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలకు https://bdl-india.in/ వెబ్ సైట్ సందర్శించండి.

పైన పేర్కొన్న పోస్టుల జీతం వివరాలు చూస్తే.. ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు నెలకు రూ.30,000-రూ.39,000, ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్/ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు నెలకు రూ.25,000 – రూ.29,500, ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్/ ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్‌కు నెలకు రూ.23,000- రూ.27,500 ఉంటుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!