రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ : అదిలాబాద్ జిల్లా మావలలో TLG ( TRUE LEAD GENERATION ) సేల్స్ మార్కెటింగ్ కంపెనీ తన యొక్క ట్రైనింగ్ యూనిట్ మావల లో పెట్టుకొని కొంతమంది యువతీ యువకులకు మార్కెటింగ్ పేరుతో ట్రైనింగ్ ఇస్తూ దాని కొరకు కొంత ఫీజును వసూలు చేస్తూ ట్రైనింగ్ ఇస్తుంది. ఈ క్రమంలో ట్రైనింగ్ కు చేరిన యువతను మీరు వేరొక కొంతమంది యువతీ యువకులను ట్రైనింగ్ కి జాయిన్ చేస్తేనే మీకు మార్కింగ్ కొరకు వస్తువులు ఇస్తాము లేకపోతే ఇంకా ఫీజు కట్టవలసి ఉంటుంది అని మార్కెటింగ్ ట్రైనింగ్ పేరుతో మోసం చేస్తుంటే దానిపై పాటిల్ గంగోత్రి అనే యువతి మావల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అట్టి TLG కంపెనీ పై కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైనా ముల్టి లెవెల్ మార్కెటింగ్ పేరుతో డబ్బులు వసూలు చేయడం గాని లేదా ఒకరు చేరితే వాళ్ల ద్వారా ఇంకో కొంత మందిని చేర్పించమని డిమాండ్ చేస్తూ మోసం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనిబడును.
Thank you for reading this post, don't forget to subscribe!విద్యార్థి సంఘాల వారు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనీ టిఎల్జీ ఫిర్యాదు
పలువురి పై కేసులు నమోదు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మావలలో టి ఎల్ జీ TLG (Ture Lead Generation) కంపెనీ అనే సేల్స్ మార్కెటింగ్ కంపెనీ తన యొక్క ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసుకొని కొంతమంది యువతీ యువకులకు సేల్స్ మార్కెటింగ్లో ట్రైనింగ్ ఇస్తుంది. అట్టి ట్రైనింగ్ సెంటర్ వద్దకు కొంతమంది వ్యక్తులు విద్యార్థి సంఘాల పేరుతో వచ్చి గత మూడు నెలలుగా డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమ కంపెనీకి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పినా వారు వినకుండా డబ్బులు ఇవ్వని పక్షంలో ఇక్కడ ధర్నా చేసి గొడవ చేస్తామని బెదిరిస్తుండడంతో అట్టి టి ఎల్ జీ TLG కంపెనీ వారు మావల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అక్షయ్, నిఖిల్, కార్తీక్ మరియు ఇంకొంద మంది వ్యక్తుల పై కేసు నమోదు చేయడం జరిగింది.
ఎవరైనా విద్యార్థి సంఘాలు లేదా ఇతర సంఘాల పేరుతో డబ్బులు వసూలు చేసినా, లేదా వసూలు చేయుటకు ఎవరినైనా బెదిరించినా అట్టి వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడును మరియు కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందనీ పోలీసు అధికారులు తెలిపారు.
Recent Comments