• అసాంఘిక కార్యకలాపాలకు జిల్లాలో చోటు లేదు – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.….
• ప్రభుత్వ రాయితీ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం…
• వారం రోజుల వ్యవధిలో 600 క్వింటళ్ల రాయితీ బియ్యం స్వాధీనం...
• ఈరోజు ఇచ్చోడ కేంద్రం నందు 290 క్వింటళ్ల ప్రభుత్వ రాయితీ బియ్యం స్వాధీనం, ముగ్గురిపై కేసు నమోదు...
• చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి, కేసులు నమోదు.…
కొత్త ఎస్పీ రాకతో భారీగా పట్టుబడుతున్న పీడీఎస్ రైస్
రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ :
ఈరోజు ( శనివారం) ఇచ్చోడ కేంద్రం నందు 290 క్వింటళ్ల ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు.
జిల్లాలో వారం రోజుల పరిధిలో 600 క్వింటళ్ల రాయితీ బియ్యాన్ని చేసుకోగా అందులో 580 క్వింటల్లా ప్రభుత్వ రాయితీ బియ్యం ఇచ్చోడా కేంద్రం నందు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, నిందితులపై తగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలో ఆసాంఘిక కార్యకలాపాలకు తావు లేదని, నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు ఇచ్చోడ ఎస్సై తిరుపతికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఇచ్చోడ కేంద్రం నందు బోధన్ నుండి ఆదిలాబాద్ వస్తున్న లారీని (TS O1 UC 7019) తనిఖీ చేయగా అందులో 290 క్వింటల ప్రభుత్వ రాయితీ బియ్యం లభించిందని తెలిపారు.
డ్రైవర్ సిడం మోతిరామ్ s/o రాందాస్ జైనథ్ మండలం సంబంధించిన వ్యక్తి పై క్రైమ్ నెంబర్ 85/2025 తో u/sec 318(4) 112 బిఎన్ఎస్ మరియు sec 7 of EC act, sec 17(c) of TSPDS కంట్రోల్ ఆర్డర్ 2016 ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కేసు నందు మరియు సోమవారం స్వాధీనం చేసుకున్న 290 క్వింటాళ్ల రాయితీ బియ్యం కేసు నందు కీలకంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల వివరాలు
1) వి వెంకటరాజు s/o సీతారామరాజు, సీతారామరాజు రైస్ మిల్ ఓనర్, ఆదర్శనగర్ ఆదిలాబాద్. ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని కొనుగోలు చేసే వ్యక్తి.
2) కైపు ప్రభాకర్ రెడ్డి s/o అంజిరెడ్డి, బోధన్. ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని సరఫరా చేసే వ్యక్తి. ముగ్గురిపై ఇచ్చోడా పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా సోమవారం స్వాధీనం చేసుకున్న 290 క్వింటల రాయితీ బియ్యం తరలిస్తున్న వాహన డ్రైవర్ వివరాలు మహమ్మద్ యూసఫ్ అహ్మద్ s/o ఖాలిక్, కైలాస్ నగర్ ఆదిలాబాద్.
అక్రమ రవాణా మరియు ఆసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వీటిని అరికట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఇచ్చోడా పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments