పెట్రోల్ క్వాంటిటీ ఎందుకు తగ్గిందని ప్రశ్నిస్తే…. బాధితుని పై అట్రాసిటి పెడతాను అని బంక్ యజమాని బెదిరింపు పాల్పడినట్లు సమాచారం….!❓️
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : భగ భగ మండుతున్న పెట్రోల్ రేట్లతో సామాన్యులు ముందే పరేషాన్ పడ్త ఉంటే పెట్రోల్ బంక్ వారు అడ్డదిడ్డంగా దోచుకుంటున్న సంఘటన ఇచ్చోడా మండలం లోని ఎస్సార్ (ESSAR) పెట్రోల్ బంక్ లో చోటు చేసుకుంది.
ఇచ్చోడా మండలం లోని ఎస్సార్ ( essar ) పెట్రోల్ బంక్ వాహనదారులను నిలువునా దోచుకుంటున్నా సంఘటన వెలుగు చూసింది. గత కొన్ని రోజులుగా పెట్రోల్ కొలతల్లో తేడా గమనించిన కొంత మంది వాహనదారులు పెట్రోల్ ను బాటిల్ లో వేయమని కోరారు. స్థానిక ఇస్సార్ పెట్రోల్ బంక్ ఓ యువకుడు తన ద్విచక్ర వాహనం లో వంద రూపాయల పెట్రోల్ పోయించుకుని వెల్లగా, ఊరు దాటముందే సుమారు సగం దూరం లో అగిపోయింది. మళ్ళీ తిరిగి అదే పెట్రోల్ బంక్ వచ్చి వంద రూపాయలు దింతో బాటిలో రూ.100 తో పెట్రోల్ కొనగా, బాటిల్ లో ఓ అర లీటర్ పెట్రోల్ కూడా రాలేదు. కొలతలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది.
ఇదేమిటని ప్రశ్నించగా ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకోండి అని సమాధానం రావడం కోసమేరుపు.

పైగా ఎక్కువ మాట్లాడితే అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించినట్లు సమాచారం.
గతంలో కూడా ఇదే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ నీళ్లు రావడం తో ప్రజలు ధర్నా చేశారు.
Recent Comments