🔶 పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంట్లో నిరసన
🔶 బాధితురాలికి న్యాయం చేయాలంటూ మహిళ సంఘాల డిమాండ్
రిపబ్లిక్ హిందుస్థాన్,ఇచ్చోడ :
ఇద్దరూ గత తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. వాళ్లిద్దరిది ఒకే కులం. పైగా దగ్గరి బంధువులే. తొమ్మిదేళ్లుగా హైదరాబాద్లో చదువుకుంటున్నారు. అయితే అ అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుందామని కోరడం తో రేపుమాపు అంటూ తప్పించుకున్నాడు. చివరికి ముఖం చాటేయడంతో తమకు న్యాయం చేయాలని ఆ అమ్మాయి ప్రియుడి ఇంట్లోనే మంగళవారం రాత్రి ధర్నాకు దిగింది. ఇచ్చోడలోని టీచర్స్ కాలనీ చెందిన చందాల హరీశ్ కుమార్ మరియు నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మసాయిపేట్ గ్రామానికి చెందిన కుంటాల సుజాత గత తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు .దేవుడి గుడిలో తన చేతికి రింగ్ తొడిగి నుదుట బొట్టు పెట్టాడని యువతి తెలిపింది. పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో తప్పించుకుంటూ తిరుగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే విషయమై గత ఏడాది 2021 ఆగస్టు 18 న కడెం పోలీస్ స్టేషన్లో న్యాయం చేయాలంటూ బాధితురాలు ఫిర్యాదు చేసిన న్యాయం జరుగడం లేదని వాపోయింది. చేసేదేమీలేక ప్రియుడి ఇంట్లో నిరసన కు దిగానని బాధితురాలు పేర్కొంది.
*బాధితురాలికి న్యాయం చేయాలి*
బాధితురాలికి న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంట్లో ధర్నాకు దిగిన బాధితురాలు సుజాతకు దళిత సంఘం యువ సేనా రాష్ట్ర అధ్యక్షురాలు నలిగంటి మల్లేశ్వరి, ఉపాధ్యక్షురాలు వెలిశెట్టి. శారద, పులికోట అనిత , సభ్యులు మద్దతు తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగేవరకు పోరాడుతామన్నారు.ప్రియుడి ఇంట్లో రాత్రి నుంచి ధర్నాకు చేస్తున్న నేపథ్యంలో ప్రియుడి తల్లిదండ్రులు ఎందుకు ఇంటిని వదిలి పారిపోయారని పేర్కొన్నారు. ఇరు కుటుంబాలు సమీప బంధువులేనని, ఒకరికొకరు ఇష్టపడి ప్రేమంచుకున్నారని, ఒకటే కులమని, ఇందులో వివక్ష ఎందుకని వారు స్పష్టం చేశారు. ఇచ్చోడకు చెందిన కుల సంఘంతో చర్చలు జరుపుతున్నామని వారు చెప్పారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments