🔶 వంద క్వింటాళ్ల రాయితీ బియ్యం స్వాధీనం చేసుకున్న స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి
🔶 ఇచ్చోడ మండల కేంద్రంలో పలు చోట్ల స్పెషల్ బ్రాంచ్ పోలీసుల దాడులు….
🔶 రెండు వాహనాలు, రాయితీ బియ్యం స్వాధీనం నిందితులపై ఇచోడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు…
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : అక్రమార్కుల పై జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసు యంత్రాంగం అధికారులు రోజురోజుకు ఉక్కుపాదం మోపుతున్నారు. స్పెషల్ బ్రాంచ్ అధికారుల మెరుపుదాడులతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగేడుతున్నాయి.
జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అంతమొందించాలనే జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసు యంత్రాంగం వేగంగా పనిచేస్తుంది.


ఇందులో భాగంగానే జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి ఇ ఆధ్వర్యంలోని బృందం ఇచ్చోడ మండల కేంద్రంలో పలుచోట్ల రాష్ట్ర ప్రభుత్వం రాయితీ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారం రావడం తో తనిఖీలు నిర్వహించగా అందులో ఇచ్చోడ వ్యాపారి అయినా గుడ్డు సెట్ వద్ద గల ఐచర్ వాహనంలో యాభై క్వింటాళ్ల రాయితీ బియ్యం, అతనికి చెందిన గోడౌన్లో 40 క్వింటాళ్ల రాయితీ బియ్యం మొత్తం 90 క్వింటాళ్ల రాయితీ బియ్యం అతని వద్ద లభించిందని జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి తెలిపారు . అదేవిధంగా ఇచ్చోడ మండలం వ్యాపారస్తుడు అయినా రెహ్మాన్ 10 క్వింటాళ్ల రాయితీ బియ్యం వాహనంలో తరలిస్తున్నారని సమాచారం మేరకు అతని వద్దనుండి రాయితీ బియ్యం స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. నిందితులు ఇద్దర్ని ఇచ్చోడ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు కోసం తరలించడం జరిగింది తెలిపారు.

అక్రమంగా రాయితీ బియ్యం నిల్వ ఉంచిన, తరలిస్తున్న వాటిని స్వాధీనపరచుకొని పౌరసరఫరాల అధికారికి తదుపరి దర్యాప్తు కోసం అప్పగించినట్లు తెలిపారు. ఈ దాడిలో ముఖ్య పాత్ర పోషించిన స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది సి అమృత్ రెడ్డి, పి స్వామి లను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.
📰 అంతులేని చీకటి వ్యాపారానికి కేరప్ అడ్రస్ ఇచ్చోడా
ఎన్నో రోజులుగా చీకటి వ్యాపారం చేస్తున్న ఇచ్చోడా కు చెందిన ‘గుడ్డు సెట్’ అనే వ్యక్తి రేషన్ బియ్యం సరఫరా చేస్తూ, నిల్వ ఉంచుకుని పట్టుబడడం మండల కేంద్రం లో సంచలనం గా మారింది. అదే విధంగా రెహమాన్ అనే మరో వ్యక్తి ని కూడా రాయితీ బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
గ్రామాల్లో తక్కువ ధరలో రేషన్ బియ్యం ఖరీదు చేసి మహారాష్ట్ర వంటి రాష్ట్రాల కు ఈ రేషన్ బియ్యం తరలించి లక్షల్లో కాసులు చేసుంటున్నారు. గుడిహత్నూర్ మండలంలొని మన్నూర్ గ్రామం నుండి రాత్రి వెళ్ళల్లో పెద్ద మొత్తం లో రేషన్ బియ్యం మహారాష్ట్ర కు ఐచర్ వంటి వాహనాల్లో తరలిస్తున్నట్లు సమాచారం.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments