రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ క్రైం :
గంజాయి అక్రమ రవాణా కేసులో నేరస్తునికి ఐదు సంవత్సరాల కఠిన కారాగర శిక్ష మరియు 50 వేల రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు జడ్జి డి మాధవి కృష్ణ తీర్పు విలువరించారు.
ఆదిలాబాద్ లైజన్ ఆఫీసర్ ఎం గంగా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా కు చెందిన గూగులోత్ నూర్ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశతో ఆక్రమ గంజాయి స్మగ్లింగ్ మార్గాన్ని ఎంచుకున్నాడు. అదిలాబాదులోని వ్యక్తులకు విక్రయించుటకు 27. 7.2016 రోజున గుగ్లోత్ నూర్ అదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో గంజాయితో ఉండగా అదిలాబాద్ టు టౌన్ ఎస్సై జి రాజన్న కు అతని పై అనుమానం కలగడంతో తనిఖీ చేయగా అతని వద్ద నుండి ఆరు కిలోల గంజాయి దొరికింది. వెంటనే ఎస్ఐ రాజన్న స్థానిక తహసిల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించి ఆ వ్యక్తిపై క్రైమ్ నెంబర్ 268 /2016 కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ ఎన్ వెంకటస్వామి కి కేసు అప్పగించగా సిఐ విచారణ చేసి అతనిపై చార్జి సీటు నమోదు చేసి ఒకటవ అదనపు కోర్టు అదిలాబాదులో దాఖలు చేశారు. ఈ కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేకల మధుకర్ సాక్షులను లోని విచారించి నేరాన్ని రుజువు చేయగా, ఐదుగురు సాక్షులను సిడిఓ ఎం శ్రీనివాస్ కోర్టులో ప్రవేశపెట్టగా అట్టి సాక్షుల్ని విచారించి అదన్నపు జిల్లా జడ్జి జిల్లా కోర్టు జడ్జి అయినా డి మాధవి కృష్ణ నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 50 వేల రూపాయల జరిమానా విధించారు. రూపాయలు 50 వేలు కట్టని యెడల అదనంగా మరో మూడు నెలలు శిక్షను ఖరారు చేసినట్లు జిల్లా లైజన్ ఆఫీసర్ ఎం గంగాసింగ్ తెలిపారు.
గంజాయి అక్రమ సరఫరా కేసులో ఒకరికి ఐదేళ్ల జైలు శిక్ష
Thank you for reading this post, don't forget to subscribe!
Recent Comments