Saturday, March 22, 2025

మిత్రులే హంతకులు …. నమ్మించి చంపేశారు…..

◾️ హత్య కేసు మిస్టరిని చెందించిన పోలీసులు…

◾️ వడ్డాడి ప్రాజెక్ట్ లో లభించిన మృతుని కేసు వివరాలు వెల్లడించిన డిఎస్పీ వీ ఉమేందర్



రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : వడ్డాడి ప్రాజెక్ట్‌ ప్రాజెక్టు లో లభ్యమైన మృతదేహం పై మృతుని తల్లి ఫిర్యాదుదారు మీర్జా షబానా బేగ్ ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో మీస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు, లోతుగా విచారణ చెప్పటి హత్య జరిగినట్లు నిర్దారించారు. సిసిఎస్ పోలీసు బృందం ఇన్స్పెక్టర్లు కె శ్రీధర్, ఈ చంద్రమౌళి మరియు ఎస్సై డి రమేష్ బాబు ఆధ్వర్యంలో
హత్య చేసిన నిందితులను పట్టుకుని, పదిరోజుల్లోనే కేసును చెందించారు.

హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న ఆదిలాబాద్ డిఎస్పీ వి ఉమేందర్.. ( చిత్రం లో నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లు )



డిఎస్పీ వి ఉమేందర్ వెల్లడించిన వివరాల ప్రకారం…. మృతుడు మీర్జా కషీఫ్ బేగ్ (17) , A1 నిందితులు షేక్ బిలాల్ అహ్మద్ (19) మరియు A2 ఒక మైనర్ బాలుడు (17) లు ముగ్గురు స్నేహితులు.

మీర్జా కషిప్ బేగ్ వృత్తి రీత్యా మెకానిక్. అయితే

నిందితులు A1,A2 లు ఇద్దరు మృతుడి బైక్ పై తిరిగేవారు.

నిందితులు A1, A2లు మద్యం సేవించడం, గంజాయి తాగడం అలవాటు పడ్డారు. తమ జల్సాల కోసం డబ్బు లేకపోవడంతో, ఏదైనా నేరం చేసి సులభంగా డబ్బు సంపాదించాలని పథకం పన్నారు.
ఇద్దరు కలిసి తమ మిత్రుడైనా మీర్జా కషీఫ్ బేగ్ ను చంపి, తర్వాత అతని యొక్క మోటార్ సైకిల్‌ను విక్రయించి డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసుకున్నారు.
తేదీ 05.07.2022 న సుమారు సాయంత్రం 5 గంటల సమయంలో నిందితుడు A1, A2 ని బైల్ బజార్‌లో కలుసుకుని…., మృతుడిని(మీర్జా కషీఫ్ బేగ్) ను వడ్డాడి ప్రాజెక్ట్‌ కు తీసుకువెళ్లి చంపి, సాక్ష్యాలు లేకుండా ప్రాజెక్ట్ నీటిలో పడేసి, ఆ తర్వాత మోటార్ సైకిల్ B/No TS-01-EQ5214 విక్రయించాలని ప్లాన్ చేశారు. వారి పథకం ప్రకారం, తేదీ 05.07.2022న 6 గంటలకు, A2 తన వద్ద ఉన్న తన తండ్రి ఫోన్ ద్వారా మృత్తిడికి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు.
ఆదేరోజు 8:45 గంటల సమయంలో మృతుడు తన స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్ B/No TS-01-EQ-5214 పై నిందితుల వద్దకు వెళ్లాడు. అక్కడ నుండి, నిందితులు మరియు మృతుడు అదే బైక్‌పై కిన్వాట్ కు వెళ్ళి ఒక వ్యక్తి వద్ద నుండి అత్యవసరంగా డబ్బు తీసుకురావాలని ముగ్గురూ కలిసి బైల్ బజార్ నుండి బయలుదేరారు. దారిలో A1 పొన్నారి గ్రామం లో ఒక కిరానా దుకాణంలో టవల్ కొని తన ప్యాంట్ జేబులో ఉంచుకున్నాడు. అందజా 11 గం.కు కిన్వాట్‌కు చేరుకున్నారు. అక్కడ వారి పథకం ప్రకారం, నిందితులు మృత్తిడితో డబ్బు ఇచ్చే వ్యక్తి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పారు.

వారి పథకం ప్రకారం, 11:30 గం.కు, ముగ్గురూ అదే బైక్‌పై కిన్వాట్ నుండి తిరిగి బయలుదేరారు. మార్గమధ్యంలో, నిందితులు మృతుడితో మాట్లాడుతూ, ఈ రాత్రి ఇంటికి వెళితే, వారి తల్లిదండ్రులు తమను తిడుతారు, సూర్యోదయం వరకు ఎక్కడైనా అగుదామని మృతుడికి చెప్పి మార్గమద్యలో వడ్డాడి ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి స్టాఫ్ రూమ్ దగ్గర మోటారు సైకిల్ నిలిపారు. వారు ప్రాజెక్ట్ వద్ద ఉండగా, అకస్మాత్తుగా, నిందితులు మృతుడిని గొంతు పిసికినారు, ఫలితంగా మృతుడు మీర్జా కషీఫ్ బేగ్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తరువాత నిందితులు, మృతుడి చేతులను టావెల్ తో నోటిని, చేతులను, మెడను కట్టివేసి, A1 మృతుడి సెల్‌ఫోన్‌ను తీసుకున్నాడు మరియు A2 ప్రాజెక్ట్‌ నీటిలో మృతుడి పర్సు, చెప్పులు పడవేసినారు.

తరువాత A1 & A2 మృతుడి మోటారు సైకిల్‌పై ఉదయానికి కిన్వాట్ చేరుకొని సూర్యోదయం వరకు రైల్వే స్టేషన్‌లో ఉన్నారు. సుమారు ఉదయం 9 గం. సమయంలో A2 తో పరిచయం ఉన్న నవీద్ r/o సుభాష్‌నగర్ కిన్వట్ వద్దకు వెళ్లి, A1 తల్లి చికిత్స పొందుతోంది మరియు అతనికి డబ్బు అవసరమని సాకుతో మృతుడి మోటార్ సైకిల్‌ను తనఖా పెట్టి అడ్వాన్సుగా రూ. 15000/- తీసుకున్నారు. మరియు మధ్యాహ్నం పర్లి-వైద్యనాథ్ రైలులో ఆదిలాబాద్‌కు వచ్చి A1 మృతుడి సెల్ ఫోన్ మరియు వాళ్ళవాళ్ళ దుస్తులను వారి ఇంట్లో పెట్టుకున్నారు.

తేదీ 17.07.2022 న 0730 గం.కు విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులు A1 & A2 లను తిర్పల్లి రైల్వే ట్రాక్‌ వద్ద పక్కన గల వాటర్ ట్యాంక్ వద్ద ఉండగా అదుపులోకి తీసుకొని చేసి ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో విచారించగా, విచారణలో వారు పై విధంగా ఈ నేరం చేసినట్లు అంగీకరించారు.


నిందితుల నుండి నగదు, మృతుడి మోటార్ సైకిల్, సెల్ ఫోన్, దుస్తులు, క్రైం ఫోన్ లను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


కేసును పదిరోజుల్లోనే చెందించిన సిసిఎస్ ఇన్స్పెక్టర్లు కె శ్రీధర్, ఈ చంద్రమౌళి , ఎస్సై డి రమేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్ లు టి విజయ్ కుమార్, టి జగన్ సింగ్, పి గంగా రెడ్డి, ఎస్ సంజీవ్, పోలీస్ కానిస్టేబుల్ లు ఎం ఏ కరీం, ఎస్ శ్రీనివాస్, బీ. నరేష్, ఆర్ ఎస్ రమేష్, ఏ రామ కృష్ణ, కె హరింద్ర నాథ్, ఆర్ వినోద్ లు డిఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి