Friday, February 7, 2025

భారీ వర్షాలతో పంట నష్టం…. రైతు ఆత్మహత్య

రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్హత్నూర్ :  గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు కారణంగా రాష్ట్రం అత్తలాకుతలం చేయడమే కాకుండా ఈ అతివృష్టి అమాయక రైతుల ఉసురు (బలి ) తీసుకొంటున్నది. భారీ వర్షాలకు పంట నష్టం జరిగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లాలోని వెనుక బాటుకు గురైన బజార్ హత్నూర్ మండల కేంద్రంలో చోటు చేసుకొంది. బజార్ హత్నూర్ ఎస్సై ముజాహిద్ మరియు మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…  బజార్ హత్నూర్ మండలానికి చెందిన తేలి శ్రీనివాస్ (43)  తన కున్న 8 ఎకరాలు వ్యవసాయ భూమికి తోడుగా మరో 12 ఎకరాలు కౌలుకు పట్టుకొని వ్యవసాయం  చేస్తున్నాడు. ఈ ఖరీఫ్ సీజన్ లో పత్తి, సొయాబీన్ పంటలు వేశాడు. అయితే ఈ విత్తనాలు ఒకసారి కాదు రెండు సార్లు వర్షం దాటికి మొలకలు ఎత్తక నష్టం వచ్చింది. 3 వ సారి కూడా నాటగా అవి ఈ సారి కూడా సరిగా మొలవలేదు. ఏకదాటి వర్షాలు పడుతున్నందున మొలకేత్తిన పంట సైతం దెబ్బ తినడమే కాకుండా పంటచేనులో ఎక్కడపడితే అక్కడ కోతకు గురైనది.
ముందే అప్పులు చేసిన శ్రీనివాస్
పంట నష్టం చూసి పరిస్థితిని  మనోవేదనకు గురై, చేసిన అప్పులు ఎలా తీర్చాలని బాధపడ్డాడు. ఏమి చేయాలో తెలియక  మనస్థపంతో జీవితం ఫై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఆదివారం ఉదయం ఇంటిల్లి పాదితో కలగొలుపుగా ఉండి, ఇంటి నుంచి ఎప్పటి లాగే వ్యవసాయక్షేత్రంలోకి పనులు చెయుటకని వెళ్లి,అక్కడనే పురుగుల మందును సేవించి, తన తమ్ముడు
ఐన టీ.రమేష్ కు తాను ఆత్మహత్యచేసుకొనుటకు పురుగుల మందు సేవించినట్లు సమాచారం అందించగా వెంటనే అతను ప్రయివేట్ వాహనంలో బోథ్ కు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే ఆ రైతు మృతి చెందారు. మృతుని భార్య తెలి నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!