జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన రైతుల క్రాప్ హాలిడే*.
రోడ్డు ఇవ్వకుండా నా భూమే అంటున్న ఓ వ్యవసాయ విస్తరణ అధికారి తతంగం
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ జిల్లా : బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ పక్కన బోథ్ (బి) శివారము ఆడెల్లి లింకు రోడ్డు ఆక్రమణ గురైందని సంభందిత రైతులు క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు.


వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ పక్కన బోథ్ (బి) శివారము ఆడెల్లి దేవస్థానం కు వెల్లె లింకు రోడ్డు గత 100 సంవత్సరాల నుండి ఉన్న రోడ్డును ఓ వ్యక్తి కుమారుడు ( ప్రభుత్వ ఉద్యోగి) , మరియు మరో వ్యక్తి కలిసి ఇరువురు పానాది 33 ఫీట్ల స్థలంను కబ్జా చేసుకుంటూ ఇప్పుడు కేవలం 8 ఫీట్ల దారిని మాత్రమె మిగిల్చారు.
ఇదే రోడ్డు గుండా దాదాపు బోథ్ బి శివారం కు వెళ్ళే రైతులు దేవాలయానికి వెళ్లి భక్తులు ఇబ్బందులు గురవుతున్నమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి సదరు వ్యక్తి రోడ్డును పూర్తిగా అక్రమించుకోవడంతో ఆగ్రహించిన రైతులు శుక్రవారం స్థానిక తహసీల్దార్, ఎస్సై లకు వినతి పత్రాన్ని సమర్పించి తమకు తాముగా
రోడ్డు శాశ్వత పరిష్కారం అయ్యే వరకు క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు.
ఏదేమైనప్పటికీ జిల్లాలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరి రెవెన్యూ యంత్రాంగం రైతులకు శాశ్వత పరిష్కారం చూపుతారో లేదో వేచి చూడాల్సి ఉంది.
Recent Comments