ePaper
Saturday, April 25, 2026
📄 ePaper

ప్రతివారం గ్రామాలను సందర్శించి సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలి – జిల్లా ఎస్పీ

📰 Generate e-Paper Clip

  • విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను సక్రమంగా అమలు చేయాలి.
  • మండల పరిధిలో ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలి.
  • గంజాయి, మట్కా, గుడుంబా లాంటివి పూర్తిగా అరికట్టాలి.

    – – బేల పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ

రిపబ్లిక్ హిందుస్థాన్ ఆదిలాబాద్:  ప్రతివారం గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మంచి సత్సంబంధాలను ఏర్పరచుకొని సమాచార వ్యవస్థను పటిష్టంగా నిర్మించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలియజేశారు.

గురువారం స్థానిక బేల మండల పోలీస్ స్టేషన్ ను సాయంత్రం సమయంలో జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను సక్రమంగా అమలు చేయాలని తెలియజేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులను విలేజ్ పోలీసు ఆఫీసర్ విచారణ జరిపి సరైన రిపోర్టును పోలీస్ స్టేషన్ నందు అందజేయాలని సూచించారు. ప్రతివారం కేటాయించిన గ్రామాలను విలేజ్ పోలీస్ ఆఫీసర్ సందర్శిస్తూ సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలన్నారు.

అదేవిధంగా గ్రామాల పరిధిలో ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు గంజాయి, గుడుంబా, మట్కా లాంటివి నిర్వహించకుండా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. మహారాష్ట్రతో సరిహద్దుతో ఉన్న కారణంగా అసాంఘిక కార్యకలాపాలకు తావునివ్వకుండా గట్టిగా పటిష్టంగా గస్తీ నిర్వహిస్తూ ఉండాలని సూచించారు. మండల పరిధిలో ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ ప్రమాదాలను అరికట్టాలని సూచించారు.

పోలీసు సిబ్బంది విధులలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ఉండాలని తెలిపారు. స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు రికార్డులను నవీకరిస్తూ ఉండాలని ఇలాంటి పెండెన్సీ లేకుండా చూడాలన్నారు. రిసెప్షన్ నందు ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ వచ్చిన ఫిర్యాదులను వెంటనే సిబ్బందిని కేటాయించి సమస్య పరిష్కరించిన కృషి చేయాలన్నారు. సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, జైనథ్ సిఐ డి సాయినాథ్, బేల ఎస్ఐ ఎన్ నాగనాథ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88