రియాద్, జూన్ 9: సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఆధ్వర్యంలో రియాద్ నగరంలో Eid-ul-Adha వేడుకలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. SATA వ్యవస్థాపకులు మల్లేశం పిలుపు మేరకు ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది.
ఈ సందర్భంగా SATA రియాద్ చాప్టర్ అధ్యక్షులు శ్రీ మచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ –
“కుల, మత భేదాలు లేకుండా మనం అందరం ఒకటిగా కలిసి ఈ పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. సౌదీలో మన తెలుగు కుటుంబాలకు ఇది ఒక చారిత్రక సంఘటన.”
SATA రియాద్ ఉమెన్స్ చాప్టర్ అధ్యక్షురాలిగా శర్వాణి విద్యాధరణి మాట్లాడుతూ –
“ఏ పరిస్థితులలోనైనా మనం ఐక్యంగా ఉండాలి. మనం ఎదగడమే కాకుండా, ఇతరులను కూడా ఎదగనిచ్చే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.”
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైస్ ప్రెసిడెంట్ నూర్ మహమ్మద్ ,
రియాద్ ఇంజినీరింగ్ చాప్టర్ అధ్యక్షులు సింగు నరేష్ కుమార్ పాల్గొన్నారు.
అలాగే కోర్ టీం సభ్యులుగా శహబాజ్, మిథున్ సురేష్, ముదిగొండ శంకర్, నయీమ్, అయాజ్, ముజామిలుద్దీన్, ఇలియాస్, కోకిల, మంజూష మహేష్ తదితరులు పాల్గొన్నారు.
పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఉత్సాహంగా పాల్గొని పండుగ సంబరాన్ని నిండుగా ఆస్వాదించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments