ప్రజలలో విజిబుల్ పోలీసింగ్ తో విధులు నిర్వహించాలి – జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
జిల్లాలో మట్కా మరియు ఆసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలి…
వర్టికల్స్లో రెండు నెలలుగా ప్రతిభ కనబరిచిన 32 గురు పోలీసు అధికారులకు గుడ్ సర్వీస్ ఎంట్రీ, క్యాష్ రివార్డ్ తో బహుమతులు
నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ బ్యూరో :
శనివారం స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు గల సమావేశ మందిరం లో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని పోలీసు అధికారులందరితో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో గత నెల రోజులుగా జరిగిన నేరలపై, నమోదైన కేసులపై, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులపై, పోలీస్ స్టేషన్ల వారీగా నిర్వహిస్తున్న 17 వర్టికల్స్, మొదలగు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ల నందు ప్రజలందరితో జవాబు దారితనంతో వ్యవహరించాలని సూచించారు. ప్రతిరోజు పట్టణంలో మండలాల వారీగా విజిబుల్ పోలీసింగ్ ను నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్క పోలీసు క్రమశిక్షణగా పోలీసు విధులను నిర్వర్తించాలని తప్పిన యెడల వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా మట్కా పూర్తి నిర్మూలన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. అలాగే ఆసాంఘిక కార్యకలాపాలైన గుట్కా, జూదం, గంజాయి,ఓపెన్ డ్రింకింగ్ లాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం సమయంలో తమ పరిధిలోని ప్రధాన మార్గాలలో తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తూ ప్రమాదాల నివారణకు తోడ్పాటు నివ్వాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ల ను సర్కిల్ ఇన్స్పెక్టర్లు తరచూ తనిఖీ చేసి తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లో అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండేలా చూడాలని తెలిపారు.
వర్టికల్స్ అయిన రిసెప్షన్, బ్లూ కోర్ట్, పెట్రో కార్, సెక్షన్ ఇంచార్జ్, స్టేషన్ రైటర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, సమన్స్, ఎస్ హెచ్ ఒ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ట్రాఫిక్, 5 S, కమ్యూనిటీ పోలీసింగ్, వారెంట్స్ అనే అంశాలపై జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరును పరిశీలించారు. అలాగే గత రెండు నెలలుగా 17 వర్టికల్స్ నందు ప్రతిభ కనబరిచిన 32 మంది పోలీసు అధికారులకు, సిబ్బందికి గుడ్ సర్వీస్ ఎంట్రీ, క్యాష్ రివార్డు పత్రాలను అందజేసి ప్రోత్సహించారు . అలాగే 5 గురు సిసిఎస్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని కేసుల పరిష్కరించడంలో ఉత్తమమైన ప్రతిభ కనబరిచినందుకు నగదు బహుమతితో ప్రోత్సహించారు. గత నెల బైక్ దొంగతనాల కేసు దర్యాప్తులో దొంగ ఆచూకీ కనిపెట్టడంలో కీలక పాత్ర పోషించి పోలీసులకు సహకరించిన రిమ్స్ సెక్యూరిటీ గార్డ్ నరేష్ కు నగదు బహుమతి ఎస్పీ చేతుల మీదుగా అందించి వారిని అభినందించారు. పోలీసు వ్యవస్థ విధులను ప్రజలలో పోలీసులపై గౌరవాన్ని, విలువను పెంచే విధంగా నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజల పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, సమయ్ జాన్ రావు, ఉట్నూర్ ఎఎస్పి హర్షవర్ధన్ శ్రీవాస్తవ, ఆదిలాబాద్ డిఎస్పి వి ఉమేందర్, ఏఆర్ డిఎస్పి ఎం విజయ్ కుమార్, సిఐలు వై రమేష్ బాబు,పి సురేందర్, కే మల్లేష్, ఎం మల్లేష్, బి రఘుపతి, కె నరేష్ కుమార్, జె కృష్ణమూర్తి, ఈ చంద్రమౌళి, ఎం నైలు, జె గుణవంత రావ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, ఎం శ్రీ పాల్, ఎం వంశీకృష్ణ, సిసి దుర్గం శ్రీనివాస్, పోలీస్ కార్యాలయం ఏవో యూనుస్ అలీ, సెక్షన్ ఇంచార్జ్ ఆషన్న, డి సి ఆర్ బి, ఐటి కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments