◼️ వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 5 జిల్లా కేంద్రాలలో భరోసా సెంటర్లను ప్రారంభించిన రాష్ట్ర డిజిపి ఎం మహేందర్ రెడ్డి
◼️ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
◼️ వేధింపులకు గురైన మహిళలకు, బాలలకు మెడికల్, న్యాయ సలహా, కౌన్సిలింగ్, సైకాలజీ సపోర్ట్, వంటి సౌకర్యాలు ఒకే గొడుగు కింద అందించేందుకు భరోసా సెంటర్…
◼️ భరోసా కేంద్రాలతో బాధితులకు తక్షణ సహాయం అందజేయడం కోసమే : ఎస్పీ
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓల్డ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ నందు నూతనంగా ఏర్పాటు చేయనున్న భరోసా సెంటర్ శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ పాల్గొన్నారు. ఈ భరోసా సెంటర్ ను రాష్ట్రవ్యాప్తంగా 5 జిల్లాల్లో అదిలాబాద్, మహబూబాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల లలో రాష్ట్ర డిజిపి ఎం మహేందర్ రెడ్డి, ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ స్వాతి లక్రా మరియు పలువురు ఉన్నతాధికారులు కలిసి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర *డిజిపి ఎం మహేందర్ రెడ్డి* మాట్లాడుతూ మొదటగా ఐదు జిల్లాలలో భరోసా సెంటర్ ప్రారంభోత్సవ శంకుస్థాపన మహోత్సవానికి విచ్చేసిన కలెక్టర్లకు జిల్లా ఎస్పీలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఐదు భరోసా సెంటర్లలకు స్పాన్సర్షిప్ చేసిన మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు ధన్యవాదాలు తెలియజేశారు.

బాధిత మహిళలకు, సంస్థకు భరోసా సెంటర్ ఒక చక్కని వేదికగా మారుతుందని, అఘాయిత్యానికి బాధితులైన మహిళలు, పిల్లలు కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది, వీరిని కేసు నమోదు కోసం పోలీస్ స్టేషన్కు, 161 స్టేట్మెంట్ నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి పోలీసులు వెళ్లడం, హాస్పిటల్ కి తీసుకెళ్లడం, కౌన్సిలింగ్ ఇప్పించడం, ఫైనల్ గా ట్రైల్ సమయంలో కోర్టుకు తీసుకెళ్లడం లాంటి విషయాలు భరోసా సెంటర్లలో బాధితులకు ఎటువంటి భయం కలగకుండా నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన వారి చేత నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ భరోసా సెంటర్లను 2016లో మొదటగా హైదరాబాదులో ప్రారంభించడం జరిగిందని జ్ఞాపకం చేశారు. అన్ని భరోసా సెంటర్లలో బాధితులు అందరికీ సమన్యాయం జరిగే విధంగా, వారికి భరోసా సెంటర్ పట్ల నమ్మకం, ఉపశమనం కలిగే విధంగా ఒక యూనిఫాం సర్వీస్ లాగా నిర్వహించాలని సూచించారు. బాధితులకు క్వాలిటీ తో కూడిన సర్వీసెస్ను అందించాలని సూచించారు. బాధితులకు సంబంధించిన అన్ని కేసులలో నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా భరోసా సెంటర్లు కృషి చేయాలని సూచించారు. బాధితులు తిరిగి పోలీస్ స్టేషన్కు వెళ్లవలసిన అవసరం లేకుండా భరోసా సెంటర్లలను నిర్వహించాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ మాట్లాడుతూ…. జిల్లాకు భరోసా సెంటర్ ను కేటాయించడం ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో భరోసా సెంటర్ ను కూడా మంచి పని తీరును కనబరిచి రాష్ట్రంలో ఉన్నత స్థానాలలో ఉంచడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. అన్ని సదుపాయాలను భరోసా సెంటర్లో కల్పించడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని, బాధిత మహిళలకు అందరికీ ఒకే ప్రదేశంలో అన్నీ వసతులు చేకూరేలా చూస్తానని తెలిపారు. హైదరాబాద్ తర్వాత జిల్లాలలో ప్రారంభించబోయే మొదటి ఫేజ్ లో ఆదిలాబాద్ జిల్లాలో భరోసా సెంటర్ ను ప్రారంభించిన నందున రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రేప్ కేసులో బాధితులకు మరియు మహిళలకు, పిల్లలకు ఉపయోగపడేలా ఉండే భరోసా సెంటర్ ను ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించిన రాష్ట్ర డిజిపి ఎం మహేందర్ రెడ్డి, అదనపు డిజి స్వాతి లక్రా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఆదిలాబాద్ పట్టణంలో 1333 స్క్వేర్ యాడ్స్ గజాల స్థలాన్ని భరోసా సెంటర్ కి కేటాయించినట్లు తెలిపారు. మహిళల పట్ల జరిగే అగాయిత్యాలు కానీ, రేప్ కేసులలో కానీ కంప్లైంట్ నుండి కన్విక్షన్ వరకు జరిగే అన్ని కార్యక్రమాలు ఈ భరోసా సెంటర్లలో నిర్వహించడం జరుగుతుందని. ఈ భరోసా సెంటర్ ను ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించడం ద్వారా జిల్లాలోని ఎందరో మంది బాధిత మహిళలకు ఉపయోగకరంగా ఉంటుందని, పోలీస్ స్టేషన్కు రావడం ఇబ్బందికరంగా ఉన్న బాధిత మహిళలు ఇకనుండి భరోసా సెంటర్ ను ఉపయోగించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఎస్ శ్రీనివాసరావు, సమయ్ జాన్ రావు, జిల్లా ఫారెస్ట్ అధికారి వి రాజశేఖర్, ఉట్నూర్ ఎఎస్పీ హర్షవర్ధన్ శ్రీవాస్తవ , అదిలాబాద్ డిఎస్పి వి ఉమేందర్, ఎం విజయ్ కుమార్, జిల్లా కోర్టు పిపిలు కిరణ్ కుమార్ రెడ్డి, ఎం రమణారెడ్డి, మేకల మధుకర్, సంజయ్ వైరాగరి, సాంఘిక సంక్షేమ అధికారి సునీత, సఖి సెంటర్ నిర్వాహకురాలు యశోద, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని మిల్కా, కృష్ణవేణి, డి ఎం & హెచ్ ఒ నరేందర్ రాథోడ్, ఎంవిఐ శ్రీనివాస్, జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments