రిపబ్లిక్ హిందుస్థాన్ , బోథ్ :
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లోని దన్నుర్ బి గ్రామస్తులు రోడ్డు సమస్యతో పడుతున్న బాధలు భరించలేక ఏకంగా అధికారిని బందీ చేసిన సంఘటన చోటు చేసుకుంది.

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి , మరమ్మత్తులకు నోచుకోని
రోడ్డు సమస్యతో సతమతమవుతున్న దన్నుర్ బి గ్రామస్తులు విసుగు చెంది సంబంధిత శాఖ ఆర్ అండ్ బి డి ఈ సునీల్ ని గ్రామ పంచాయతీ భవనం లో నిర్బంధించారు. గతంలో అనేక సార్లు రోడ్డు సమస్య గురించి రాతపూర్వకంగా , మరియు అనేక విధాలుగా విన్నవించినా రోడ్డు సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
రోజురోజుకు రోడ్డు పై ప్రయాణం నరకప్రాయంగా మారిన అధికారుల్లో చలనం లేకపోవడం సిగ్గుచేటని గ్రామస్తులు అన్నారు. రోడ్డు సమస్య పరిష్కారం అయ్యేదాక అధికారిని విడిచేది లేదని గ్రామ విడిసి సభ్యులు అన్నారు. డి ఈ పైఅధికారులకు రోడ్డు సమస్య గురించి వివరించి సమస్య పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది.
Recent Comments