గిరిజన బంధు అమలు చేయాలని తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించిన కాంగ్రెస్ నాయకులు….
రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడా : తెలంగాణ రాష్ట్రంలో దళిత , గిరిజన వర్గాలకు సంబంధించి అభివృద్ధి , సంక్షేమ పథకాలు అమలు చేయడం , దళిత , గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఎస్.సి. , ఎస్.టి. సబ్ ప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించడం , దళిత బంధుతో పాటు గిరిజన బంధు కూడా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఇచ్చోడా కాంగ్రెస పార్టీ నాయకులు ఇచ్చోడా తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వినతిపత్రం లో ఈ విధంగా ….. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.సి.ఆర్బి 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు దళిత , గిరిజన వర్గాల సంక్షేమం , అభివృద్ధి , ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం అనేక రకాల హామీలిచ్చారు. కానీ , గత ఏడేండ్లుగా ఆ వర్గాలకిచ్చిన ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు . ప్రధానంగా 2014 లో తాను అధికారంలోకి వస్తే , ప్రతి దళిత కుటుంబానికి 2 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వడంతో పాటు ఏడాది పాటు ఆ లబ్దిదారునికి అవసరమైన వ్యవసాయ ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు . కాని మా మండలంలో ఒక్క దళిత , గిరిజన కుటుంబానికి కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు భూమి ఇవ్వలేదు . అలాగే తెరాస పార్టీ అధికారంలో వస్తే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఒక దళిత నేతనే వుంటాడని , అది దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక అని , నేను మాట ఇస్తే తప్పనని , మాట తప్పితే తల నరుక్కుంటానని అనేక సభలలో కె.సి.ఆర్ మాట్లాడారు . కాని ఇచ్చిన హామీ తుంగలో తొక్కి రెండు సార్లు కె.సి.ఆర్ . ముఖ్యమంత్రి పదవి చేపట్టి దళితులను మోసం చేశారు . అలాగే , 2014 లో దళిత ఉపముఖ్యమంత్రిగా వున్న తాటికొండ రాజయ్యను అకారణంగా , అత్యంత అవమానకరంగా , కనీసం రాజీనామా చేయమని కూడా చెప్పకుండా కేబినెట్ నుండి బర్త్ రఫ్ చేసి ఒక దళిత నేతను బయటకు పంపారు . ఇలా మొత్తం దళిత జాతిని కె.సి.ఆర్ . నిట్టనిలువునా అవమానపరిచారు .
తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవానికి ప్రతీకగా పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని కె.సి.ఆర్ . 2014 లో హామీ ఇచ్చారు . రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది అర్హులైన పేదలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు . కానీ , వారిలో ఒక శాతం మందికి కూడా ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు . 2014 ఎన్నికల మేనిఫెస్టోలో దళిత వాడల అభివృద్ధికి 10 వేల కోట్లు , గిరిజన తండాల అభివృద్ధికి 5 వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఖర్చు పెడతామని హామీ ఇచ్చినా , అందులో 50 శాతం నిధులు కూడా ఈ ఏడేండ్లలో ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు . కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఎస్.సి., ఎస్.టి. సబ్ ప్లాన్ క్రింద బడ్జెట్ లో జనాభా దామాషా ప్రకారం ఖర్చు చేయాలన్న చట్టం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ విధంగా ఆయా ప్రాంతాలలో నిధుల వ్యయం చేయలేదు .
కేసీఆర్ ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు . తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో లక్ష 17 వేల గాలు ఖాళీలున్నాయి . ఇటీవల బిస్వాల్ కమిటి ఇచ్చిన నివేదికలో లక్ష 91 వేల ఖాళీలు ఉన్నట్లు అన్నారు . ఆ రకంగా తెలంగాణలో ఏడేండ్లలో అన్ని శాఖలను పరిశీలిస్తే దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నట్లు సమాచారముంది . ఒక వేళ ఈ ఉద్యోగాలు భర్తీ చేసివున్నట్లయితే 20 శాతం తీసుకున్నా , లక్ష ఉద్యోగాలు ఎస్.సి. , ఎస్.టి. అభ్యర్థులకు లభించేవి . రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక స్వావలంబన కలిపించేందుకు , ఎస్.సి. , ఎస్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ నిధులు ఇచ్చి , దళిత , గిరిజన యువతకు ఆర్థిక సహకారం అందించి వుంటే లక్షలాది యువకులు వారి కాళ్ళపై వారు నిలబడి ఆత్మ గౌరవంతో బ్రతికేవారు . కె.సి.ఆర్ . ఇచ్చిన హామీలలో కేజి టూ పిజి ఉచిత నిర్బంధ విద్య ఏడేండ్ల క్రింద అమలు చేసి వుంటే , లక్షలాది మంది గిరిజన దళిత గిరిజనులు విద్యావంతులు , విజ్ఞాన వంతులు అయ్యేవారు . ఈ ఏడేండ్ల తెలంగాలు స్వయంపాలనలో సగటు తెలంగాలు వ్యక్తికి ఉద్యోగం లేదు . ఉపాధి లేదు . భూమి లేదు . ఇల్లు లేదు . చదువు లేదు . అవి లేకుండా ఆత్మ గౌరవం ఎలా సాధ్యం ? ఇప్పుడు ‘ దళిత బంధు ‘ పేరుతో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు . అది కూడా పైలట్ ప్రాజక్టు క్రింది ఉప ఎన్నికలు జరుగుతున్న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితం చేస్తున్నారు . కె.సి.ఆర్ కు దళితుల సంక్షేమం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్ర మంతటా దళిత బంధు పథకాన్ని అన్ని కుటుంబాలకు అమలు చేయాలని మరియు అదే విధంగా రాష్ట్రంలోని గిరిజనుల కుటుంబాలకు కూడా ఈ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము .
అలాగే కె.సి.ఆర్ . ఎన్నికలకు ముందు గిరిజనులకు 12 % రిజర్వేషన్లు అమలు చేస్తానని హామీ ఇచ్చారు . రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలుచేసి తీరాలి . కాని ఇంతవరకు వారికి పాత రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి .
వెంటనే గిరిజనులకు కె.సి.ఆర్ . ఆ ప్రకారం 12 % రిజర్వేషన్లు అమలు చేయాలి . తెలంగాణ మూల లక్ష్యాలలో ఆత్మగౌరవం , స్వేచ్ఛ , సమపరిపాలన . వాటి కోసమే ” దళిత , గిరిజన ఆత్మగౌరవ దండోరా ” కార్యక్రమంతో మరోసారి పోరాటం చేస్తున్నాము . మా హక్కులు సాధించే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది . మా ఈ వినతిపత్రాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి అంగచేస్తారని ఆశిస్తున్నమని అన్నారు. కార్యక్రమంలో ఇచ్చోడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments