🟥 నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమైనది…
🟥 ప్రతి ఒక్క బ్యాంకు పరిసర ప్రాంతంలో కనీసం నాణ్యత ప్రమాణాలతో కూడిన, అత్యాధునిక రెండు సీసీ కెమెరాలు కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి*
🟥 ఆదిలాబాద్ లోని అన్ని బ్యాంకుల అధికారులతో భద్రత కోణం లో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ జిల్లాను నేర రహిత జిల్లాగా రూపొందిద్దాం అని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుత సమాజంలో ఆర్థిక నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు పాత్ర కీలకమైనదని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. గురువారం స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరం నందు పట్టణంలోని అన్ని బ్యాంకులకు సంబంధించిన రీజనల్ మరియు బ్రాంచ్ మేనేజర్స్ అధికారులతో జిల్లా ఎస్పీ భద్రత (సెక్యూరిటీ) కోణంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం నందు సుమారు 45 బ్యాంకులకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి ఒక్క బ్యాంక్ తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ చట్టం 2013 ప్రకారం కొన్ని సూచనలను తప్పకుండా పాటించాలని అందులో భాగంగానే బ్యాంకు పరిసర ప్రాంతాలలో కనీసం నాణ్యత ప్రమాణాలు కలిగి ఉన్న రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. ప్రతి ఒక్క బ్యాంకుకు సంబంధించిన సీసీ కెమెరాలను 30 రోజులకు తగ్గకుండా బ్యాకప్ ను ఏర్పాటు చేసుకోవాలని, ఎటువంటి సందర్భంలోనైనా పోలీసు అధికారులకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఆర్థిక నేరాలను అరికట్టడంలో తోడ్పాటునియాలని తెలియజేశారు.

ఈ సీసీ కెమెరాల ముఖ్య ఉద్దేశం ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దున ఉంది, దేశంలో ఎక్కువ శాతం దొంగలు ప్రస్తుతం అమలు చేస్తున్న తీరును దృష్టిలో ఉంచుకొని బ్యాంకుల లో దాచుకున్న ప్రజల డబ్బును సురక్షితంగా ఉంచుతూ, ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండటానికి, ఆర్థిక నేరాలను అరికట్టడానికే, ఒకవేళ ఎటువంటి నేరం అయినా జరిగినట్లయితే దానిని 24 గంటల లోపే పరిష్కరించేలా జిల్లా పోలీసులు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు. సీసీ కెమెరాలు బ్యాంక్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకొని యెడల బ్యాంకు అధికారులకు నోటీసులు అందించే అధికారం పోలీసులకు ఉందని తెలియజేశారు. జిల్లాను ఆర్ధిక నేర రహిత జిల్లాగా రూపొందించడానికి బ్యాంకుల పాత్ర కూడా ఒకరకంగా దోహదపడుతుందని తెలియజేశారు. గతంలో వివిధ పట్టణాల్లో జరిగిన పాత కొన్ని బ్యాంకు దోపిడీలను, దొంగలు అవలంబించిన తీరును పరిశీలించి మరియు పోలీసులు చేసిన విచారణ పద్ధతిని బ్యాంకు అధికారులతో చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోనికి, జిల్లాలోని కి వచ్చే ప్రతి ఒక్క దారి సీసీ కెమెరా పరిధిలోకి వస్తుందని, ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలు ఆదిలాబాద్ పట్టణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు, హైదరాబాదులోని కమాండ్ సెంటర్కు అనుసంధానించబడినవని, పట్టణంలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విస్తృత స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి వి ఉమేందర్, ఒకటవ పట్టణ సీఐ పి సురేందర్, అదిలాబాద్ గ్రామీణ సీఐ బి రఘుపతి, ట్రాఫిక్ సిఐ కొంక మల్లేష్, పట్టణంలోని బ్యాంకు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments