రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్ హత్నూర్ : ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం లో దేగామ గ్రామంలో ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి పెళ్లికాని యువకుడు కాపీసే గజేందర్ (27) బుధవారం రోజు గ్రామానికి సమీపంలో గల చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆవేదనకు గురి అయి కన్నీరు మున్నీరు గా రోదిస్తున్నారు. కుటుంబ సభ్యుల మరియు బజార్హత్నూర్ ఎస్సై సయ్యద్ ముజాహిద్దీన్ వివరాల ప్రకారం అతను ప్రైవేట్ ఉపాధ్యాయుని గా పని చేస్తూ ఉండేవాడు. అయితే గత ఆరు నెలల నుంచి మానసిక ఒత్తిడికి గురై మతిస్థిమితం కోల్పోయిన అతను జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియజేశారు. మృతుని అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలియజేసారు . ఈ సంఘటనతో దేగామ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
జీవితంపై విరక్తి చెంది ప్రయివేట్ ఉపాధ్యాయుడి ఆత్మహత్య
Thank you for reading this post, don't forget to subscribe!


Recent Comments