*శాంతి భద్రతల పరిరక్షణలో… తనదైన మార్క్
*రౌడీ మూకల ఆగడాలకు కళ్లెం
*సిబ్బంది సంక్షేమంలో ఆయనకు ఆయనే సాటి
*మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలు భేష్
*ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజల చెంతకు పోలీస్ సేవలు
*సమర్థవంతమైన అధికారిగా ప్రజల్లో గుర్తింపు
*అందరివాడిగా చెరగని ముద్ర వేసుకున్న ఎస్సై బి శివకుమార్
*ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందించాలంటే కత్తి మీద సాము లాంటి పోలీసు వ్యవస్థలో సమర్థవంతమైన దమ్మున్న పోలీసు ఉన్నతాధికారి ఎంతో అవసరం, నిత్యం రౌడీ మూకలు, కరుడుగట్టిన నేరస్తుల వల్ల ఎదురయ్యే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూన్న ఆ క్రమంలో బాణాల్ల ఎదురయ్యే ఆరోపణలు, అధిగమించి శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పరిస్థితి. పోలీసులపై ఆరోపణలు తప్ప ఎక్కడ వారిపై మంచి అభిప్రాయం కనుమరుగైన పరిస్థితి. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటినుండి అటు సిబ్బంది సంక్షేమంలోనూ, శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన శైలిలో చర్యలు తీసుకుంటూ అందరి మన్ననలు పొందుతు సమర్థవంతమైన అధికారిగా పోలీస్ శాఖకు వన్నె తెచ్చారు. ఆయన అందించిన సేవలను ఇకముందు కూడా కొనసాగించాలని ఆకాంక్షిస్తూ రిపబ్లిక్ హిందుస్థాన్ అందిస్తున్న ప్రత్యేక కథనం…
రిపబ్లిక్ హిందుస్థాన్, వరంగల్ : ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా ప్రజలు ప్రశాంతమైన జనజీవనంలో జీవించాలని కోరుకుంటారు. అదేవిధంగా ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే ఆ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. అటువంటి శాంతి భద్రతలను అదుపు చేసే పోలీస్ శాఖ ఎంతో పటిష్టంగా ఉండాలి, అందుకు తగ్గ సమర్థవంతమైన అధికారి పోలీస్ శాఖకలో ముందుండి నడిపిస్తేనే ఆ శాఖలో మిగిలిన అధికారులు సిబ్బంది కూడా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతరు. వరంగల్ నగరంలోని ఇంతేజర్ గంజ్ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టి తనదైన శైలిలో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ, సిబ్బందిలో ఉత్సాహం నింపుతూ, వారికి సంక్షేమ పలలు అందించడంలో ముందుంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు, సిబ్బందికి సూచనలిస్తు, నిరంతరం శ్రమిస్తూ.. సమర్థవంతమైన అధికారిగా ఇటు ప్రజలు, అటు పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల మన్ననలు పొందుతూ సక్సెస్ ఫుల్ గా విధులు నిర్వహిస్తూ అందరి హృదయాల్లో ఎస్ఐ బి శివకుమార్ చెరగని ముద్ర వేసుకున్నారు.
సబ్ ఇన్స్పెక్టర్ గా బి శివకుమార్ ప్రస్థానం
జనగామ జిల్లా జాఫర్గడ్ మండలంలోని ముక్తం తండలో నిరుపేద కుటుంబంలో తల్లిదండ్రులు యాకూబ్ బుజ్జమ్మ లకు బి శివ కుమార్ జన్మించాడు. తండ్రి హెడ్ కానిస్టేబుల్. పోలీస్ కుటుంబం కావడంతో చిన్నప్పటినుండే పోలీస్ అవ్వాలని లక్ష్యం పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టు ఉన్నత చదువులు చదివి అందులో ఉత్తీర్ణుడయ్యాడు. 2020 సంవత్సరంలో ఎస్సై పోస్ట్ కి ఎంపికయ్యాడు. వివిధ జిల్లాలలో పోస్టింగ్ ద్వారా విధులు నిర్వహించి ప్రస్తుతం వరంగల్ నగరంలోని ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు.
వినూత్న కార్యక్రమాలతో.. ప్రజలకు, సిబ్బందికి చేరువ
బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ఇటు ప్రజలకు, అటు సిబ్బందికి చేరువయ్యేలా కృషి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజల సమస్యలను మహిళా పోలీసుల సహకారంతో స్థానిక పోలీస్ స్టేషన్ లకు తీసుకొని వెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
మహిళల భద్రతపై.. అధిక ప్రాధాన్యత
రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతపై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దిశా యాప్ను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ఎస్సై బి శివకుమార్ ప్రత్యేక దృష్టి సారించి దిశ యాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి వారి భద్రతకు ప్రతిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ప్రత్యేక దృష్టి
జిల్లాలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల కట్టడికి, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ఎస్సై శివ కుమార్ ప్రత్యేక దృష్టి సారించి చేసుకుంటున్నా చర్యలు భేష్ అని ప్రజలతో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలతో చీకటి కార్యకలాపాలను కట్టడి చేసే దిశగా అనేక చర్యలు తీసుకున్నారు. నాకా బందితో తరచూ వాహనాల తనిఖీలు మరియు ప్రాంతాలలో కార్డెన్ సర్చ్ లతో అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం వంటి చర్యలతో అక్రమ వ్యాపారాలను ఎక్కడిక్కడ కట్టడి చేస్తున్నారు.

అందరి సహకారంతో విజయవంతంగా విధినిర్వహణలోనూ ఎంతో సంతృప్తికరంగా ఉంది
— బి శివకుమార్
జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు అందించిన సహకారంతో విజయవంతంగా పూర్తి అవడం ఎంతో సంతృప్తికరంగా ఉందని ఎస్సై పేర్కొన్నారు. ప్రధానంగా సిబ్బంది సహకారంతో జిల్లాలో ఎన్నో క్లిష్టతరమైన కేసులను సునాయాసంగా చేదించగలడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని, మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తు అసాంఘిక చర్యలను నిలువరించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments