— రూ.70 వేలు విలువ గల రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్న స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి…
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
బుధవారం పట్టణంలో భారీగా గుట్క నిల్వ ఉందని విశ్వసనీయ సమాచారం మేరకు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి ఆధ్వర్యంలోని బృందం పట్టణంలోని గణేష్ థియేటర్ దగ్గర గల ఎస్ఎస్ ట్రేడర్స్ నందు తనిఖీ చేయగా అందులో రూ.70,000 వేలు విలువ చేసే రాష్ట్రప్రభుత్వం నిషేధిత గుట్కా లభించిందని తెలిపారు. ఎస్ఎస్ ట్రేడర్స్ యజమాని షేక్ జబ్బీర్(34) ను అదుపులోకి తీసుకొని, నిందితున్ని మరియు స్వాధీనం చేసుకున్న గుట్కాను స్థానిక ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ నందు క్రైం నెంబర్ 176/2022 గా నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఆపరేషన్ నందు ఏఎస్ఐ సురేందర్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Recent Comments