Friday, February 7, 2025

Boath: ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్ధార్
  : రాజేశ్వర్ మాదిగ

రిపబ్లిక్ హిందుస్థాన్,ఇచ్చోడ : గురువారం రోజున ఇచ్చోడ మండల కేంద్రములో ఎమ్ఆర్పిఎస్ జిల్లా కన్వీనర్ అరెల్లి మల్లేష్ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు పై మాదిగ ఉపకులాల అభివృద్ధిని పట్టించుకోవటం లేదని చేసిన ఆరోపణలను  శుక్రవారం రోజున విలేకరుల సమావేశములో టి.ఆర్.ఎస్ ఎస్సి సెల్ ఉపాధ్యక్షుడు ఉప్పులూటీ రాజేశ్వర్ మాదిగ తీవ్రంగా ఖండించారు.
విలేకరుల సమావేశములో ఎస్సి సెల్ ఉపాధ్యక్షుడు  మాట్లాడుతూ ఇటీవల ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో 100 యూనిట్లకు గాను 34 యూనిట్లు మాదిగ, మాదిగ ఉపకులాలకు కేటాయించారని, మిగత ఎస్సి కులాలకన్న మాదిగ కులస్తులకు పెద్ద పిఠావేసిన ఘనత ఎమ్మెల్యేదని, దళిత బస్తి భూముల పంపిణీలో రాష్ట్రములోని బోథ్ నియోజకవర్గం నెంబర్ వన్ అని,1000 మంది లబ్ధిదారులకు భూములు పంపిణీ చేస్తే 700 మంది అందులో మాదిగ, మాదిగ ఉపకులలా వారే ఉన్నారని, సి.డి.పి నిధుల కింద 2 కోట్ల 79 లక్షలు మాదిగ కులస్తులు ఎక్కువ ఉన్న గ్రామలకే కేటాయించారని అన్నారు. ఎస్సి కార్పొరేషన్ ద్వారా ఎంతో మందికి లబ్ధిచేకూర్చారని పేర్కొన్నారు. అవగాహన రాహిత్య, అసత్య ఆరోపణలు మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని,మాదిగ నాయకులమని చెప్పుకునే మీరు ఎప్పుడైనా మాదిగల బాగోగుల గురించి ఆలోచించారా, ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బహుజన నాయకుడైన బోథ్ శాసనసభ్యుడు రాథోడ్ బాపురావు పైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. మీ మాటలు చూస్తుంటే కొన్ని రాజకీయ శక్తులకు అమ్ముడు పోయి,మాదిగల, మాదిగ ఉపకులాల పొట్ట కొట్టాలని చూస్తున్నారని, ఇంకో సారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాదిగలుగా మా తడాఖా చేయిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమములో టి.ఆర్.ఎస్ మండల మహిళ అధ్యక్షురాలు గోనె లక్ష్మీ మాదిగ,సోన్న లక్ష్మీ,జ్యోతి,లక్ష్మీ,లింగన్న, పెద్ద లచ్చన్న, గ్యాతం గంగయ్య,గాయకాంబ్లీ గణేష్,కడమంచి భీముడు తదితరులు పాల్గొన్నారు..


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!