
ప్రతి పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు పెద్దన్నగా అండగా ఉంటా : డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ (రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్)
సామాజిక సేవలే ప్రధానం – సహాయమే మా సారథ్యం : జాటోత్ దవిత్ కుమార్ (రెహమాన్ ఫౌండేషన్ లింగాపూర్ మండల ఇంచార్జి)
లింగాపూర్ : లింగాపూర్ మండల కేంద్రంలోని సామాన్య నిరుపేద కుటుంబం *జాధవ్ కమలా బాయి అంబాజి* దంపతుల తృతీయ కుమార్తె *జాధవ్ సుప్రియా* వివాహానికి ఆర్థిక భరోసాగా రెహమాన్ ఫౌండేషన్ అండగా నిలిచింది.
రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ : షేక్ అబ్దుల్ రెహమాన్ జిలాని సహకారంతో శుక్రవారం 18,050/- రూపాయల కిరాణా సరుకులు జాటోత్ దవిత్ కుమార్ చేతుల మీదుగా శుక్రవారం కుటుంబ సభ్యులకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఫౌండేషన్ వంతు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆ ఇంట్లో ఐదుగురు ఆడపిల్లలు ఉండడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకొని, సాటి కుటుంబానికి పెద్దన్నగా అండగా నిలబడాలనే మానవతా దృక్పధంతోనే ఈ సహాయాన్ని అందించడం జరిగిందన్నారు.* ఆడపిల్లలను ఎవరు భారంగా భావించవద్దని, స్వచ్చంద సామాజిక సేవకులు నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసాగా ముందుకు రావాలని తెలిపారు. *చైర్మన్ గారు వృత్తి రీత్యా హైదరాబాద్ ఉన్నందున రాలేకపోయారని సభ్యులు తెలిపారు.
ఆడబిడ్డల పెళ్లిళ్లకు రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ సహాయ సహకారాలు ఆదేశాల మేరకు లింగాపూర్ మండల ఇంచార్జి జాటోత్ దవిత్ కుమార్ చేస్తున్న కృషిని కుటుంబ సభ్యులు సంతోషించారు. ఈ కార్యక్రమంలో జాధవ్ సామాజిక సేవకులు జాధవ్ ప్రశాంత్, జాటోత్ లింగన్నా, రంగిబాయి, జాధవ్ సుశాంత్, పవార్ ధన్రాజ్, చవాన్ విశాల్, జాధవ్ ఆకాష్, ఆడే కేతన్, రాథోడ్ సంతోష్ తదితరులు ఉన్నారు.
Recent Comments